సీఎం రేవంత్ నిధుల వరదతో.. రాజసంగా రాజన్న సిరిసిల్ల జిల్లా!

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించారు ప్రజా పాలన సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ వేడుకలలో భాగంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సాక్షి కురిపించారు. ప్రజా పాలన తొలి ఏడాదిలోనే మొత్తం 679 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు.

పలు శంకుస్థాపనల్లో సీఎం రేవంత్ రెడ్డి
236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ చేశారు.
166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

CM Revanth reddy gave huge funds for rajanna siricilla district

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
76 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేశారు. 42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. వేములవాడ పట్టణంలో కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవం చేశారు.

వైద్య, విద్యా, సాగునీటి రంగానికి నిధులు
3 కోట్ల 80 లక్షలతో వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు.వీర్నపల్లిలో కోటి యాభై లక్షలతో పి.హెచ్.సి నిర్మాణం, మేడిపల్లిలో 5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ సేకరణకు 5 కోట్ల నిధులను విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరావాస ప్యాకేజ్ 9 పనులకు 11 కోట్ల 79 లక్షలు విడుదల చేశారు.

మహిళలకు ఆర్ధిక చేయూత, గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా రేవంత్
ఇవి మాత్రమే కాదు 631 మహిళా స్వయం సహాయక సంఘాల వారికి 102కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కుల పంపిణీ చేశారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారు. మొత్తం 17 కుటుంబాలకు 85లక్షల పరిహారం అందజేశారు. మొత్తంగా ప్రజా పాలన తొలి ఏడాదిలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+