కేసీఆర్ రికార్డులను బద్దలుకొట్టిన సీఎం రేవంత్ రెడ్డి!!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆరవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ పై జరిగిన చర్చ తెలంగాణ రాష్ట్ర శాసనసభ చరిత్రలో హిస్టరీని తిరగరాసింది. నిన్న ఉదయం మొదలైన శాసనసభ సమావేశం మంగళవారం ఉదయం మూడు గంటల 15 నిమిషాల వరకు కొనసాగడం శాసనసభ రికార్డులను బద్దలు కొట్టింది.

రికార్డ్ బ్రేక్ చేసిన అసెంబ్లీ సమావేశం
నిన్న ఉదయం ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దుచేసి అసెంబ్లీలో పద్దుల పైన చర్చ కొనసాగించారు. 19 శాఖల పద్దులపైన జరిగిన చర్చ దాదాపు 17 గంటలకు పైగా సాగింది. నిన్న ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాల నుండి 5.50 నిమిషాల వరకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం మళ్లీ అసెంబ్లీ మొదలైంది.

CM revanth reddy record break and push back kcr with 17hrs continuous assembly session

కేసీఆర్ రికార్డులను తిరగరాసిన సీఎం రేవంత్
అది మంగళవారం ఉదయం 3 గంటల 15నిమిషాల వరకు కొనసాగింది. బడ్జెట్ పై జరిగిన ఈ చర్చలో 19 పద్ధులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను స్పీకర్ ప్రసాద్ కుమార్ మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. దీంతో తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో కొత్త రికార్డు క్రియేట్ అయింది. గతంలో కేసీఆర్ రికార్డును ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బద్దలు కొట్టారు.

కేసీఆర్ ను పక్కకు నెట్టిన రేవంత్ రెడ్డి
గతంలో కెసిఆర్ అర్ధరాత్రి 12 గంటల వరకు అసెంబ్లీని కొనసాగించారు. అప్పట్లో అది రికార్డు.. ఇప్పుడు సుమారు ఏకంగా ఒకటే రోజులో 17 గంటలకు పైగా అసెంబ్లీని కొనసాగించి రేవంత్ రెడ్డి కేసీఆర్ రికార్డును పక్కకు నెట్టారు. ప్రస్తుతం ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

నేడు అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు
ఇదిలా ఉంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును శాసనసభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+