ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రవాణా శాఖ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పనుంది. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపైన లైసెన్సులు, ఆర్ సి ల కోసం కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, వాటి ముద్రణను, పంపిణీని సులభతరం చేసే కీలక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది.
సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ పద్ధతికి సీఎం ఆమోదం
ప్రస్తుతం 61 ఆర్టీవో ల నుంచి వస్తున్న కార్డుల స్థానంలో సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించగా దీనికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ప్రతి సంవత్సరం దాదాపు 4.70లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, 9.90లక్షల వాహన రిజిస్ట్రేషన్ లతో కలిపి మొత్తం 14నుండి 15లక్షల వరకు డ్రైవింగ్ లైసెన్సులు ఆర్సి కార్డులను ఆయా జిల్లాలలో రవాణా శాఖ కార్యాలయాల నుంచి ప్రభుత్వం వాహనదారులకు అందిస్తుంది.

వాహనదారుల ఇంటికే నేరుగా కార్డులు
అయితే కార్డుల పంపిణీకి. వారాలు నెలలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక గతంలో ఏసీబీ తనిఖీలు చేసిన క్రమంలో వందలకొద్ది డ్రైవింగ్ లైసెన్సులు వాహన రిజిస్ట్రేషన్ కార్డులు ఏజెంట్ల వద్ద లభ్యం కావడంతో కలకలం రేగింది. రవాణాశాఖ ఆఫీసులలో మధ్యవర్తుల ప్రమేయం పైన చర్చ జరిగింది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఏజెంట్లకు చెక్ పెట్టే క్రమంలో నేరుగా వాహనదారుడి ఇంటికే కార్డులు చర్యల ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కేంద్రీకృత విధానంతో కార్డుల పంపిణీలో వేగం
ఈ కేంద్రీకృత విధానం ద్వారా ముద్రణ ఆలస్యం తగ్గి పంపిణీ వేగవంతంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట నుండి డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్ సి లు జారీ అవుతాయి. రవాణా శాఖకు పన్నులు, ఫీజులు ద్వారా ప్రతీ సంవత్సరం సుమారు 6,700 కోట్ల నుంచి 6900 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఇందులో 135 కోట్లకు పైగా యూజర్ చార్జీలు ఉన్నాయి.
ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు శుభవార్త
ఈ నిధులను శాఖకు కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్ సి లు సెంట్రలైజ్డ్ చేసి ఒకే చోట నుంచి పంపిణీ చేయాలన్న నిర్ణయం వాహనదారులకు నిజంగా శుభవార్త అని చెప్పాలి. లేదంటే ప్రతి చోట ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కార్డుల కోసం వాహనదారులు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఇక మధ్యలో దళారీ వ్యవస్థ వాహనదారులను నిలువునా దోచుకుంటుంది.












Click it and Unblock the Notifications