వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం.. టీడీపీ తాజా మాజీకి పార్టీ టికెట్.. ఫైనల్ లిస్ట్ ఖరారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : Congress Final List : బీసీ ఓట్ల కోసం ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్ లో చోటు

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఫైనల్ లిస్ట్ ఖరారు చేసింది. మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ పెద్దలు.. తాజాగా మరో ఆరుగురితో నాలుగో జాబితా రిలీజ్ చేశారు. అయితే ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్ జాబితాలో చోటు దక్కడం చర్చానీయాంశంగా మారింది.

టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తో జట్టుకట్టి మహాకూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్ పెద్దలకు ఆది నుంచి టికెట్ల పంపిణీలో తలనొప్పి తప్పలేదు. అటు మిత్రపక్షాలకు సర్దుబాటు చేయలేక, ఇటు సొంతగూటి నేతలకు సర్దిచెప్పలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు పొత్తులు ఖరారయి కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీచేసేందుకు అంగీకారం కుదిరింది. దీంతో మూడు దఫాలుగా 88 మంది అభ్యర్థులను ప్రకటించినా.. మరో ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారు విషయంలో తంటాలు పడ్డారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. సోమవారం నాటితో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ఆదివారం రాత్రి ఆరుగురు అభ్యర్థులను డిక్లేర్ చేశారు.

కాంగ్రెస్‌ తుది జాబితా ఇదే :

మిర్యాలగూడ - ఆర్‌. కృష్ణయ్య
సికింద్రాబాద్‌ - కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌
కోరుట్ల - జువ్వాడి నర్సింగ్‌రావు
నారాయణపేట్‌ - వామనగారి కృష్ణ
దేవరకద్ర - డాక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి
నారాయణఖేడ్‌ - సురేష్‌ కుమార్‌ షెట్కర్‌

 6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ 6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ

 టీడీపీ తాజా మాజీకి కాంగ్రెస్ టికెట్

టీడీపీ తాజా మాజీకి కాంగ్రెస్ టికెట్

ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొంటామన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. టికెట్ల కేటాయింపులో ఆలస్యం చేసింది. అయితే టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికే ఈ ఆలస్యమనేది ఆ పార్టీకి చెందిన కొందరు నేతల వాదన. పొత్తుల్లో భాగంగా టీడీపీకి కొన్ని స్థానాలు కేటాయించింది కాంగ్రెస్. అయితే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎల్బీనగర్ నుంచి గెలుపొందిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు అనూహ్యంగా కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఆయనకు మిర్యాలగూడ టికెట్ ఖరారు చేశారు.

ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్.కృష్ణయ్య. ఈక్రమంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు కనిపించింది. అప్పట్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటానని ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో పార్టీలో జాయిన్ కాలేదు. ఎన్నికల నేపథ్యంలో తాజాగా హస్తం గూటికి చేరారు. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు.

 ఊగిసలాట.. ఎట్టకేలకు ఖరారు

ఊగిసలాట.. ఎట్టకేలకు ఖరారు

కాంగ్రెస్ తుది జాబితాలో చోటు దక్కే ఆ ఆరుగురు ఎవరనేది ఉత్కంఠ రేపింది. సోమవారం నాటితో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ఆదివారం సాయంత్రమైనా.. కాంగ్రెస్ పెద్దలు పేర్లు ప్రకటించకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. తీరా ఆదివారం రాత్రి ఆ ఆరుగురి పేర్లతో లిస్ట్ ఫైనల్ చేశారు.

మిర్యాలగూడ స్థానానికి అనూహ్యంగా ఆర్.కృష్ణయ్యను డిక్లేర్ చేయడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయన గతంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోనంటూ వ్యాఖ్యానించారు. కొన్ని రాజకీయ సమీకరణాలతోనే ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కిందని తెలుస్తోంది. మరోవైపు కోరుట్ల టికెట్ కోసం మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నర్సింగరావ్ తో పాటు కొమిరెడ్డి రాములు తీవ్రంగా పోటీపడ్డారు. తనకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్న కొమిరెడ్డి రాములు ప్రచార వాహనాలు కూడా సిద్దం చేసుకున్నట్లు సమాచారం. చివరకు జువ్వాడి నర్సింరావు పేరును ఖరారు చేసింది అధిష్టానం.

 బీసీ పొలిటికల్ కోటాపై కృష్ణయ్య గళం.. అందుకేనా కాంగ్రెస్ టికెట్?

బీసీ పొలిటికల్ కోటాపై కృష్ణయ్య గళం.. అందుకేనా కాంగ్రెస్ టికెట్?


కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలయ్యాక ఆర్. కృష్ణయ్య నిరసన గళం వినిపించారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపించారు. అంతేకాదు ఈనెల 17న స్టేట్ బంద్ కు కూడా పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కడం చర్చానీయాంశంగా మారింది. బీసీ పొలిటికల్ కోటాపై కాంగ్రెస్ ను తూర్పారబట్టడంతోనే టికెటిచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

బీసీల ఓట్ల శాతం గణనీయంగా ఉండటం.. కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించడం ఇదంతా కూడా పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించిందనే అపవాదు పొగొట్టుకోవడంతో పాటు మిర్యాలగూడ స్థానంలో పొత్తుల సమస్యకు చెక్ పెట్టడానికే కృష్ణయ్యకు అక్కడ టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. అదలావుంటే మిర్యాలగూడ స్థానంలో పోటీ చేసేందుకు టీజేఎస్ పార్టీ కూడా తమ అభ్యర్థి విద్యాధర్ రెడ్డికి బీఫామ్ ఇవ్వడం కొసమెరుపు.

English summary
congress party final list announced. earlier tdp candidate r.krishnaiah got a ticket from congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X