కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్‌తో చర్చ!!

కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నమ్ముకున్న నాయకులంతా నట్టేట ముంచి పోతున్నారు. నిన్న మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులను అనుభవించిన, కీలకంగా వ్యవహరించిన కడియం శ్రీహరి ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇప్పటికే పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరగా, తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ వంకే చూస్తున్నారు.దీంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి అన్నది తెలంగాణాలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న చర్చ.

వరంగల్ కాంగ్రెస్ టికెట్ పై పీటముడి వీడటం లేదు. ఒక్కొక్కరుగా కీలక నేతలు కాంగ్రెస్ బాట పడుతుంటే టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తుంది. తాజాగా కడియం శ్రీహరి ఆయన తన కుమార్తె కావ్య తో కలిసి నిన్న రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్యతాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Congress Warangal MP ticket for whom discussion with Kadiam Srihari and his daughter politics

ప్రకటన అనంతరం, తండ్రి కడియం శ్రీహరి తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో నిన్నటి వరకు కీలక భూమిక పోషించిన నేత. ప్రస్తుతం మారుతున్న తాజా రాజకీయ పరిణామాలతో కుమార్తెతో కలిసి కడియం శ్రీహరి ఢిల్లీ బాట పట్టారు. ఆమె వచ్చిన తర్వాతే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈరోజు ఏఐసిసి పెద్దలను కలిసిన అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

వరంగల్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని పోటీ చేయమని అడుగుతున్నట్టు, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుండి తమ కుమార్తెకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్టు సమాచారం. అయితే కడియం శ్రీహరికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

ఈనెల 31వ తేదీన కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించనున్న నేపథ్యంలో కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్లో చేరితే పరిణామాలు ఏ విధంగా మారుతాయి? వీరిలో ఎవరికి కాంగ్రెస్ టికెట్ వస్తుంది. మరోవైపు సీపీఐ పొత్తుల నేపధ్యంలో వరంగల్ టికెట్ తమకు కావాలని పట్టు పడుతుంది. తమ అభ్యర్థిగా బీఆర్ లెనిన్ పేరును ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి అన్నది అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈసారి వరంగల్ లో ఊహించని పోటీ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+