వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్వేలు బరిలో 15 మంది - హుజూరాబాద్ లో 37 మంది : ఇక అసలు రాజకీయం మొదలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే తుది జాబితా ఖరారైంది. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో..ఇక పోటీలో ఉన్నదెవరనే అంశం పైన స్పష్టత వచ్చింది. బద్వేలు ఉపఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉప సంహరణ తరువాత పోటీలో నిలిచిన 15 మంది అభ్యర్థులతో పాటుగా ఒక నోటా గుర్త ఈవీఎంల్లో కనిపంచనుంది.

బై పోల్ నామినేషన్ల విత్ డ్రా పూర్తి

బై పోల్ నామినేషన్ల విత్ డ్రా పూర్తి

చివరి రోజు కావటంతో ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ల పరిశీలనలో 9 మందివి తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చివరిగా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా అధికారులు ఖరారు చేసారు. అదే విధంగా తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో చివరగా బరిలో 37 మంది అభ్యర్ధులు మిగిలారు.

హుజూరాబాద్ బరిలో 37 మంది

హుజూరాబాద్ బరిలో 37 మంది

బీజేపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. బీజేపీ తరపున నామినేషన్ వేసిన ఈటెల జమున ..తన భర్త ఈటల రాజేందర్ కు పార్టీ భీ పారం దక్కటంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అదే విధంగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ అనే అభ్యర్థి విత్ డ్రా చేసుకున్నట్లుగా వెల్లడించారు. మొత్తం ఇప్పటి వరకూ 42 మంది బరిలో ఉండగా ఐదుగురు విత్ డ్రా చేసుకున్నారు.

బద్వేలు పోటీలో 15 మంది అభ్యర్ధులు

బద్వేలు పోటీలో 15 మంది అభ్యర్ధులు

దీంతో..హుజూరాబాద్ తుది పోరులో 37 మంది అభ్యర్థులు నిలిచారు. అందులో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉండగా...29 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు..మరో 5గురు వివిధ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఆధారంగా బ్యాలెట్ ఇవిఎం లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాలెట్ లో 15 మంది అభ్యర్థులు 1 నోటా కలిపి 16 గుర్తులతో పొందుపర్చాల్సి ఉంటుంది. ఉప ఎన్నిక బరిలో మూడు ఇవిఎం లు పెట్టె అవకాశం ఉంది. మరో వైపు ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లతో నెంబర్లతో అక్షర క్రమంలో సింబల్స్ కేటాయింపు కు అధికారుల సన్నాహాలు ప్రారంభించారు.

Recommended Video

చాలా కాలం తర్వాత హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు!!
అధికార పార్టీల సమర్ధతకు పరీక్షగా

అధికార పార్టీల సమర్ధతకు పరీక్షగా

రెండు సీట్ల పైనా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ధీమాగా ఉన్నాయి. హుజూరాబాద్ లో ఈటల ను ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్..అదే విధంగా టీఆర్ఎస్ పైన గెలవాలని ఈటల ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ఏపీలోని బద్వేలులో ఇప్పుడు వైసీపీ..బీజేపీ..కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా పోటీలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో..ఆయన సతీమణి సుధకు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో..జనసేన..టీడీపీ తాము పోటీ చేయటం లేదని ప్రకటించాయి. ఇక, బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనేది చర్చకు కారణమైంది. ఇక, గత ఎన్నికల కంటే భారీ మెజార్టీ సాధించాలని వైసీపీ నేతలకు పార్టీ అధినేత..సీఎం జగన్ నిర్దేశించారు.

English summary
15 contesting candidates in BAdvel by poll race and 37 members in Huzuarabad after with draws time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X