మండుటెండల్లో కూల్ ఐడియా: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అలా; రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి
మండుటెండలలో ఉపశమనం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. వేసవి వేడిని తట్టుకోలేక ప్రజలు రోడ్లమీద తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళలోనూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాని పరిస్థితులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి .
రోడ్లపై ఎండల దెబ్బకు వాహన చోదకులు విలవిల
అయితే అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లే వాళ్ళు మాత్రం ఎండల దెబ్బకు ఒకింత ఇబ్బంది పడుతున్నారు. గత రికార్డులను బద్దలు కొడుతూ పగటి ఉష్ణోగ్రత ఏకంగా 46 డిగ్రీలకు పైగా ఉండడంతో రోడ్లపై వెళ్ళే వాహనదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వాహన చోదకులు అక్కడక్కడ చెట్లు ఉన్న దగ్గర కాసేపు ఆగి సేద తీరుతున్నారు.

అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ నెట్ లు
ఇక ఎండల సమయంలో రోడ్లమీద ప్రయాణం చేసే వారికి ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆ సమయంలో వారు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా మండుతున్న ఎండలకు ఒక చక్కని పరిష్కారాన్ని కనిపెట్టింది పుదుచ్చేరి ప్రభుత్వం. రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ నెట్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల సూర్యుడి నుంచి వచ్చే ఎండ నేరుగా వాహనదారులమీద పడకుండా పైన కట్టి ఉన్న నెట్ లు ఆపుతున్నాయి.
ఎండల నుంచి ఉపశమనం కలిగించే ఆలోచన
పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పిడబ్ల్యుడి ఈ బృహతరమైన కార్యాన్ని చేపట్టింది. ఇక దీంతో అక్కడ వాహనదారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఎండల నుంచి ఉపశమనం కలిగించి కూలయ్యే ఆలోచన చేశారంటూ ప్రభుత్వం పైన పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే హైదరాబాదీలు కూడా ఇటువంటి ఏర్పాట్లు హైదరాబాద్లో చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Good Job Pondicherry Govt 👏🏻👏🏻 pic.twitter.com/mXevqRpo1q
— Karthik Ravivarma (@Karthikravivarm) May 1, 2024
హైదరాబాదీలు డిమాండ్
గ్రీన్ నెట్ లను ఏర్పాటు చేస్తే కొంతవరకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండల తీవ్రతకు వడ దెబ్బ తగలకుండా చేయొచ్చని వారు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ తమకు కూడా ఇటువంటి ఫెసిలిటీ కల్పించాలని రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పైన గ్రీన్ నెట్ లను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications