వరంగల్ జిల్లాలో కోవర్టు రాజకీయాలు: టెన్షన్ లో అభ్యర్థులు!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈరోజు మంచి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులను కోవర్టులుగా రంగంలోకి దించుతున్నారు.
తమ వారిని కావాలని ప్రత్యర్థుల దగ్గరకు పంపిస్తూ, అక్కడ వారు చేస్తున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ లో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయిన అన్ని పార్టీల నేతలు కోవర్టు రాజకీయం చేస్తుండడం ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది.

అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలు అనేక నియోజకవర్గాలలో కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలలో విపరీతంగా చేరికలు కొనసాగుతున్న వేళ, నిజంగానే వారంతా తమపై అభిమానంతో పార్టీలోకి మారుతున్నారా? లేక ఇదొక రకమైన ట్రాప్ పాలిటిక్స్ నా అనేది అర్థం కాకుండా ఉంది.
కోవర్టుల ను రంగంలోకి దింపి ప్రత్యర్థులను నిలువరించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్ని పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్న క్రమంలో ఎవరు తమకోసం పనిచేసేవారు? ఎవరు కోవర్టులు? అనేది తెలియక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగడం ప్రధానంగా కనిపిస్తుంది.
అయితే ఈ చేరికలు అన్నీ నిజంగానే కొనసాగుతున్న చేరికలా లేక కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా కొనసాగుతున్న చేరికలా అనేది మాత్రం అంతుబట్టడం లేదు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం అన్ని పార్టీల అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ వేదికగా సాగుతున్న కోవర్టు రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications