డామిట్ కథ అడ్డం తిరిగింది: కేసీఆర్‌కు ఊహించని దెబ్బ, టారెత్తిపోయిన దేశపతి?

Subscribe to Oneindia Telugu
  డామిట్ కథ అడ్డం తిరిగింది: కేసీఆర్‌కు ఊహించని దెబ్బ ? KCR trolled for targeting Reddy community

  హైదరాబాద్: సమయం కాదు.. సందర్భమేమి లేదు.. ఆ సాయంత్రం వీ6లో ఆ నలుగురు ముఖాలను చూడగానే దాదాపుగా సీన్ మొత్తం అర్థమైపోయింది. ఇదో పక్కా ప్రీ-ప్లాన్డ్ స్క్రిప్టుతో నడిచే ప్రోగామ్ అని చాలామంది ఫిక్స్ అయిపోయారు.

  అందుకు తగ్గట్లే వాళ్ల మాటలు.. టార్గెట్ చేసుకున్న వర్గం మీద విమర్శలు చేస్తూ కార్యక్రమం సాగింది. కానీ కేసీఆర్ డైరెక్షన్‌కు తగ్గట్లుగా కాకుండా.. ఎక్కడో కాస్త తేడా కొట్టడంతో సీన్ మొత్తం బోల్తా కొట్టింది. తిట్టి తిట్టనట్లు.. కొట్టీ కొట్టనట్లు చెప్పాలనుకున్న విషయం కాస్త.. సూటిగా రెడ్డి సామాజిక వర్గం గుండెలను గాయపరిచింది. వెరసి టీఆర్ఎస్ కు ఓ పూడ్చలేని డ్యామేజీ జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

  ఎందుకీ కార్యక్రమం?:

  ఎందుకీ కార్యక్రమం?:

  నిజమే.. తెలంగాణలో రాజకీయంగా రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. కేసీఆర్ నాయకత్వంతో ఇప్పుడు వెలమల రాజకీయ ప్రాబల్యం పెరుగుతోంది. రెంటికీ పెద్ద తేడా ఏమి లేదు. రాజకీయాల్లో కులం కార్డు వాడటం ముందు నుంచి ఉన్నదే.

  తెలంగాణ ఏర్పడక ముందువరకు ఇక్కడ రెడ్ల హవా కొనసాగుతూ వచ్చింది. కేసీఆర్ నాయకత్వం వారి హవాకు బ్రేక్ వేసిందనే చెప్పాలి. నాయకత్వం రెడ్ల నుంచి వెలమలకు షిఫ్ట్ అయ్యేసరికి వారిలో కొంత అసహనం గూడు కట్టుకుంది. అందుకే రెడ్లంతా ఒక్క తాటి పైకి వచ్చి మళ్లీ అధికారంలోకి రావాలనే తెర వెనుక ప్రయత్నాలు కూడా కొన్ని జరిగాయి.

  కేసీఆర్ భయపడ్డారా?:

  కేసీఆర్ భయపడ్డారా?:

  తెర వెనుక జరుగుతున్న రెడ్ల ఐక్యత గురించి కేసీఆర్ లో ఒకింత ఆందోళన రేకెత్తినట్లుగానే తెలుస్తోంది. అదీగాక.. జేఏసీ చైర్మన్ కోదండరాం ఆయనకు సమవుజ్జీగా జనంలో ప్రాచుర్యం పొందుతుండటం ఆయనకు ఏమాత్రం సహించడం లేదు. రాజకీయంగా ఆయన బలపడితే.. భవిష్యత్తులో తనకు దెబ్బ తప్పదన్న సంకేతాలను గ్రహించారు.

  నిజానికి కోదండరాం రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ.. ఆయన కులం చట్రంలో ఇరుక్కుపోయినట్లు కనిపించరు. కానీ ఆయన పేరు చెప్పుకుని మిగతా రెడ్డి నాయకులు తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న తీరును కొట్టిపారేయలేం. అందుకే ఉన్నపలంగా రెడ్లను విలన్లను చేయగలిగితేనే.. రాజకీయంగా వాళ్లను తన దరిదాపుల్లో లేకుండా చేయవచ్చని కేసీఆర్ భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

  వీ6 డిబేట్:

  వీ6 డిబేట్:

  రెడ్లపై ప్రతికూల అభిప్రాయం కలిగేలా చేయాలనే ప్లాన్ కచ్చితంగా కేసీఆర్ నుంచే అమలయ్యిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికోసం తన అనుయాయిలైన దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్, వి ప్రకాశ్, అల్లం నారాయణలను రంగంలోకి కేసీఆర్ రంగంలోకి దింపాడు.

  వీ6 చానెల్ ను వేదికగా ఖరారు చేసుకుని ఒక ప్రీ-ప్లాన్డ్ ప్రోగ్రామ్ నడిపించాడు. కానీ వి ప్రకాశ్, దేశపతి చేసిన విమర్శలు రెడ్లను తీవ్రంగా గాయపరిచాయి. దీంతో కేసీఆర్ ఒకటనుకుంటే మరొకటి జరిగింది.

  ఒకటి.. ఈ ప్రోగ్రామ్ పెయిడ్ ఆర్టికల్ తరహా హంగామా అని అందరికీ తెలిసిపోయింది. రెండు.. తమ మీదే జిమ్మిక్కులు ప్రదర్శిస్తారా? అన్న అసహనంతో రెడ్డి సామాజికవర్గం టీఆర్ఎస్ కు దూరంగా జరిగే పరిస్థితి ఏర్పడింది.

  కోదండరాంతో కలిసి:

  కోదండరాంతో కలిసి:

  వీ6 ప్రోగ్రామ్ పూర్తిగా బెడిసికొట్టడంతో కేసీఆర్ పట్ల రెడ్డి సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరిగింది.గతంలో కేసీఆర్ ను సపోర్ట్ చేసిన కొంతమంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు.. ఇప్పుడు కోదండరాం క్యాంప్ లో కనిపిస్తున్నారు. దీన్నిబట్టి టీఆర్ఎస్ మీద రెడ్డి దెబ్బ గట్టిగానే తగిలినట్లు అర్థమవుతోంది.

  ఈ వ్యతిరేకత కొంతమంది వరకే ఆగిపోకుండా.. మున్ముందు రెడ్డి సామాజికవర్గంలో టీఆర్ఎస్ పట్ల మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వీ6లొ ప్రసారమైన డిబేట్ ఇప్పటికే పలు వాట్సాప్, ఫేస్ బుక్ లలోని రెడ్డి గ్రూపులలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో వక్తల మాటలు విన్నవాళ్లంతా టీఆర్ఎస్ ను ఛీ కొడుతున్న పరిస్థితి వచ్చింది.

  సిద్దిపేటలోనే తిరగబడ్డారంటే:

  సిద్దిపేటలోనే తిరగబడ్డారంటే:

  టీఆర్ఎస్ కు కంచుకోట లాంటి సిద్దిపేటలోనే రెడ్డి సామాజిక వర్గం ప్రజలు దేశపతి శ్రీనివాస్ మీద తిరగబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలూరీ గౌరీ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా దేశపతికి ఈ చేదు అనుభవం ఎదురైంది.

  దేశపతి మీద రెడ్డి జనం తిరగబడ్డారని తెలియగానే.. ఆ కార్యక్రమానికి రావాల్సిన మరో అతిథి దేవీప్రసాద్ అటువైపు తొంగి కూడా చూడలేదు. వీళ్ల వ్యాఖ్యలను రెడ్డి జాగృతి వంటి సంస్థలు సీరియస్ గా తీసుకున్నాయి కాబట్టే సెగ గట్టిగానే తగులుతున్నట్లు అర్థమవుతోంది. మున్ముందు ఇది జిల్లాల్లోకి, గ్రామాల్లోకి మరింత విస్తరిస్తే.. టీఆర్ఎస్ కు ఆ సామాజిక వర్గం దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవిధంగా ఇదంతా కేసీఆర్ అండ్ కో స్వయంకృతాపరాధమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It seems Telangana Chief Minister KCR has made a self-goal by targeting Reddy community with his supporters

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X