Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. సేఫ్టీ ఫస్ట్!!

దేశవ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగ హడావిడి మొదలైంది. ధన త్రయోదశి పండుగ రోజు నుంచి దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక దీపావళి అంటే అందరికీ గుర్తొచ్చేది టపాసులు. అయితే టపాసులను కాల్చే విషయంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

దీపావళి సమయంలో టపాసులను కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోక గాయాలు పాడిన వారు ఎంతో మంది ఉన్నారు. చూపు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. కాబట్టి దీపావళి సమయంలో టపాసులు కాల్చేవారు సేఫ్టీ ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుని బాణాసంచా కాల్చాలి. మరి టపాసులు కాల్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 Diwali 2023: These precautions are mandatory while burning crackers.. Safety first!!

టపాసులను కాల్చేటప్పుడు ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ గా ఉండే గ్రీన్ క్రాకర్స్ ను కాల్చాలి. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా, బాగా డేంజరస్ గా ఉండే క్రాకర్స్ జోలికి అసలు వెళ్ళకూడదు. ఇంకా టపాసులు కాల్చే సమయంలో వేసుకునే బట్టల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. పట్టు బట్టలు, నైలాన్ బట్టలు పొరపాటున కూడా ధరించకూడదు.

బాణాసంచా కాల్చే సమయంలో వాటిని వెలిగించేటప్పుడు ముఖాన్ని వాటికి దగ్గరగా పొరపాటున కూడా పెట్టకూడదు. ఒక్కోసారి అవి ఒక్కసారిగా పేలి మనల్ని గాయాలపాలు చేస్తాయి. కాబట్టి ముఖం దగ్గరగా పెట్టి బాణసంచా కాల్చకండి. పిల్లలతో టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తగా గమనించాలి. వారికి ఎలాంటి హాని జరగకుండా ఉండేలా పక్కనే ఉండి టపాసులు కల్పించాలి.

బాణసంచాతో ప్రయోగాలు చేయకుండా ఉండాలి. పేలని టపాసుల వద్దకు వెళ్లి పదే పదే ముఖం పెట్టి చూడకూడదు. బాగా పొగ ఎక్కువ వచ్చే టపాసులను కాల్చకూడదు. దీనివల్ల ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. టపాసులు కాల్చే సమయంలో బకెట్ తో నీళ్లు ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గర పెట్టుకోవాలి. విద్యుత్ స్తంభాలు, వైర్లు ఉన్న దగ్గర బాణాసంచా కాల్చకూడదు.

టపాసులు కాల్చేటప్పుడు పాదరక్షలు ధరించాలి. ఆసుపత్రులకు, పెట్రోల్ బంకు లకు దగ్గరగా ఎవరూ బాణసంచాను కాల్చకూడదు. ఇక ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఈ దీపావళిని ప్రతి ఒక్కరు సేఫ్ గా జరుపుకోవాలి. సంతోషంగా, ఉత్సాహంగా సంబరాలు చేసుకోవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+