గద్వాల బరిలో డీకే అరుణ లేనట్టే.. కారణం ఏమిటంటే!!
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ బిజెపిలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఈసారి జరిగే ఎన్నికలలో బిజెపి నుండి డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు.
అయితే ప్రస్తుతం వారి బాటలోనే గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ఆమె గద్వాల ఎన్నికల బరిలో ఉండబోనని స్పష్టం చేశారు. గద్వాల్ ఎన్నికల్లో పోటీలో ఉండబోనని అధిష్టానానికి కూడా డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. అయితే తాను లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తానని వెల్లడించారు.

ఇక ఈ పరిణామంతో గద్వాలలో బిజెపి నుండి ఎవరు బరిలోకి దిగబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గద్వాల నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిరాసక్తత చూపడంతో గద్వాలలో నాయకత్వ శూన్యత నెలకొంది.
ఒకపక్క బి ఆర్ ఎస్ పార్టీ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని బీఆర్ఎస్ మళ్ళీ ప్రతిపాదించగా, కాంగ్రెస్ పార్టీ నుండి గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితను అభ్యర్థిగా ప్రకటించారు. కానీ బిజెపి నుంచి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే బిజెపి మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
అయితే తన స్వయంగా చేసుకున్న సర్వేల్లో మూడో స్థానంలో రావడంతో డీకే అరుణ వెనకనుంచి వేశారని స్థానికంగా చర్చ జరుగుతుంది. అయితే గద్వాలలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ, బీసీని రంగంలోకి దింపితే అది ఏమేరకు ఫలితాలను ఇస్తుంది అనేది మాత్రం ఆసక్తికరమే. ఏది ఏమైనా ప్రస్తుతం గద్వాల బీజేపీ లో డీకే అరుణ తీసుకున్న నిర్ణయం తో ఒక అనిశ్చితి నెలకొంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications