ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్ లు, ఇంటర్ విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణా రాష్ట్రంలో విద్యా రంగానికి తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రాధాన్యతను ఇస్తోంది. విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు, విద్యార్థులలో డ్రాపవుట్ పర్సంటేజ్ తగ్గించటం కోసం తెలంగాణా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా పదోతరగతి తర్వాత కళాశాల విద్యనూ మధ్యలోనే ఆపేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని వారికి మరిన్ని సౌకర్యాలు, స్కాలర్ షిప్ లు అందిస్తే వారి చదువు ఆగదని భావిస్తున్నారు.
1,000 మంది దివ్యాంగ విద్యార్థులకు ఈ-స్కూటర్లు
ముఖ్యంగా ఉన్నత చదువులపై ఆసక్తి తగ్గడంతో పాటు, దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్లు ఇంటర్మీడియట్‌లో చేరడం లేదని గుర్తించిన ఇంటర్ విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే 1,000 మంది దివ్యాంగ విద్యార్థులకు ఈ-స్కూటర్లు అందించాలని ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదించింది. విద్యార్థులు చదువు మధ్యలో ఆపకుండా వారు కళాశాలలకు సులువుగా రావటానికి ఇవి ఉపయోగపడతాయి.

నెలకు రూ.2,500 స్కాలర్‌షిప్
పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఒక్కో స్కూటర్ దాదాపు రూ.50,000లకే వస్తుందని అధికారులు అంచనా వేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సమర్పించిన ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే పదో తరగతి టాపర్లకు కూడా ఏటా 10 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌లు, ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.2,500 స్కాలర్‌షిప్ అందించాలని కూడా ప్రతిపాదించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు వెల్కమ్ కిట్ లు
ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.ఈ ప్రతిపాదనలు డ్రాపవుట్ అవుతున్న విద్యార్థుల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల ఆధారంగా రూపొందించారు. ఇక ఇప్పటికే వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు నోట్ బుక్స్, ఏక రూప దుస్తులతో పాటు వెల్కమ్ కిట్ లు కూడా ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.
ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదు అనే ఆలోచన
ఈ ప్రతిపాదనలు కూడా ఆమోదం పొందితే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చదువును కొనసాగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలలో వీటిని ఆమోదించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టు, విద్యాశాఖ చేస్తున్న ప్రతిపాదనల ఆధారంగా తెలుస్తుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications