Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రలోభాల పర్వం: ప్రత్యర్థుల డబ్బు పంపిణీకి చెక్ పెట్టే పనిలో అన్ని పార్టీల అభ్యర్థులు!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు డూ ఆర్ డై అన్నట్టే ఉన్నాయి. అయితే ప్రచారం రేపటితో ముగియనున్న క్రమంలో అన్ని నియోజకవర్గాలలో సైలెంట్ గా ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. చాప కింద నీరులా డబ్బు పంపిణీ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు ఇంతకాలం ఎన్నికల ప్రచారం సాగించి, ఇప్పుడిప్పుడే పోల్ మేనేజ్మెంట్ పైన ఫోకస్ పెడుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో తమకు బలమున్న ప్రాంతాలు ఏంటి? బలం లేని ప్రాంతాలు ఏంటి? తదితర వివరాలను తెలుసుకొని తదనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఒకపక్క ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ప్రత్యర్థుల పైన ఫోకస్ పెడుతున్నారు. డబ్బు, మద్యం పంపిణీకి అభ్యర్థులు తెర తీయడంతో ప్రత్యర్థులను నిలువరించే వ్యూహాలకు పదును పెట్టారు.

 Election temptations: Candidates of all parties trying to stop money distribution of opponents!!

ఏయే ప్రాంతాలలో ప్రత్యర్థుల మనుషులు తిరుగుతున్నారో నిఘా పెట్టి, ఆయా ప్రాంతాలలో డబ్బు పంపిణీ జరగకుండా చూస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లకు, ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి డబ్బు పంపిణీ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రలోభాలను కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే కుల సంఘాలకు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున పార్టీలు ఇస్తూ వారిని తమ వైపుకు తిప్పుకుంటున్న నేతలు, ప్రధానంగా నియోజకవర్గంలో తమకు ఎక్కడ ఓటు బ్యాంకు బలహీనంగా ఉందో ఫోకస్ పెట్టి, అక్కడ ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలలో భారీగానే డబ్బు పంపిణీ జరుగుతుందని సమాచారం.

ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని పార్టీలు హోరాహోరీ గానే తలపడుతున్నాయి. జాతీయ నాయకులను రంగంలోకి దించి ప్రచారంలో దుమ్ము దులిపాయి. మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికలలో జోరుగా ప్రలోభాలు కొనసాగే అవకాశం ఉండగా, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసే పనులు అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఉన్నారు. ఆ దిశగా వారంతా పనిచేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+