గోవా బీచ్ ఫెస్టివల్స్ .. హైదరాబాద్ నుండి తెలంగాణా టూరిజం ప్యాకేజ్!
న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే ప్రపంచం సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారతదేశంలో గోవాలో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. డిసెంబర్లో గోవాలో అనేక బీచ్ ఫెస్టివల్స్ చాలా స్పెషల్. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కు జరిగే గోవా ఫెస్టివల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ నెలలో గోవాలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గోవా బీచ్ లలో ఈ నెలలో రకరకాల వేడుకలను నిర్వహిస్తారు.
డిసెంబర్ లో గోవాలో బీచ్ ఫెస్టివల్స్
డిసెంబర్ 28నుంచి 30తేదీల్లో గోవాలో సన్ బర్న్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన డీజేలు పాల్గొనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్. ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ 31న బీచ్ లలో పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఇది లైవ్ మ్యూజిక్, బాణసంచా పార్టీలతో చాలా ఉత్సాహంగా సాగుతుంది. డిసెంబర్లో మరో ముఖ్యమైన సెరెండిపిటి ఆర్ట్స్ ఫెస్టివల్ కూడా గోవాలో అందరినీ ఆకట్టుకుంటుంది.

గోవా వెళ్ళాలంటే తెలంగాణా టూర్ ప్యాకేజీ
డిసెంబర్ మాసంలో గోవాలో వాటర్ స్పోర్ట్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. గోవాకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ఇస్తుంది. ఇది ప్రతి సోమవారం హైదరాబాద్ నుండి గోవాకు ప్యాకేజ్ ను అందిస్తుంది. మొత్తం నాలుగురోజుల పాటు సాగే ఈ టూర్ గోవా ప్యాకేజ్ టూర్ పేరుతో తెలంగాణ టూరిజం వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం, బస, ఇతర కార్యకలాపాలు కూడా ఉంటాయి.
తక్కువ ధరలకే గోవా టూర్ ప్యాకేజీ
తెలంగాణ టూరిజం అందిస్తున్న ఈ ప్యాకేజీలో టికెట్ల ధర పెద్దలకు 11999 రూపాయలు పిల్లలకు 5999 రూపాయలుగా ఉంది. ఏసీ వోల్వో బస్సులలో అకామిడేషన్ తో రెండు రాత్రులు అక్కడే హాల్ట్ చేసేలా ఈ టూర్ ప్యాకేజీ షెడ్యూల్ చేయబడింది. ఈ టూర్ కి వెళ్లాలంటే సోమవారం నాడు మధ్యాహ్నం బషీర్బాగ్ సిఆర్వో నుండి రెండు గంటలకు బస్సు ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో భోజనానికి ఆపుతారు.
గోవాలో షెడ్యూల్ ప్రకారం పర్యాటక ప్రాంతాల సందర్శన
మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు హోటల్ బెవ్వాన్ రిసార్ట్ కు చేరుకుంటుంది. అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత నార్త్ గోవా లోని పర్యాటక ప్రాంతాలకు 10 గంటలకు బయలుదేరుతారు. మపుసా సిటీ, లార్డ్ బొద్గేస్వర్ టెంపుల్, ఫోర్ట్ అగువడి, బాగా బీచ్, కలంగుట్ బీచ్, వగటోర్ బీచ్ చూస్తారు. మూడవరోజు సౌత్ గోవాలోని పర్యాటక ప్రాంతాలను చూస్తారు.
బీచ్ లు, టెంపుల్స్ అన్నీ చూసేలా రూట్ మ్యాప్
డోనా పౌలా బీచ్, మిరామర్, ఓల్డ్ గోవా చర్చ్ లు, మంగుషీ టెంపుల్స్, కోల్వ బీచ్, మార్దోల్ బీచ్ తదితర పర్యాటక ప్రాంతాలను చూస్తారు. అదేరోజు సాయంత్రం బోట్ క్రూయిజ్ లో షికారు కూడా చేయొచ్చు. అయితే వారి సొంత ఖర్చుల పైన ప్రయాణం చేయవలసి ఉంటుంది. రాత్రి మళ్ళీ హోటల్ బెవ్వాన్ రిసార్ట్ లో స్టే చేస్తారు.
డిసెంబర్ గోవా ఫెస్టివల్స్ అస్సలు మిస్ కావద్దు
మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరిగి అక్కడనుండి ప్రయాణమై ఆరు గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అది తక్కువ ధరలోనే గోవా టూర్ ను అందిస్తున్న తెలంగాణ టూరిజం కు సంబంధించి ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి. వచ్చే డిసెంబర్లో గోవాలో జరిగే బీచ్ ఫెస్టివల్స్ ని అస్సలు మిస్ కాకండి.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications