దసరా, దీపావళి పండుగలకు నిత్యావసరాలు, వంటనూనెల ధరల షాక్!
దసరా పండుగ వేళ సామాన్య, మధ్య తరగతి ప్రజలలో పండుగ వాతావరణం కనిపించడం లేదు. దసరా పండుగ సందర్భంగా నిత్యవసర వస్తువుల ధరలు, నూనెల ధరలు తగ్గుతాయని భావిస్తే నిత్యవసర వస్తువుల ధరలు, నూనెల ధరలు అందుకు భిన్నంగా ఆకాశాన్ని తాకడం ప్రతి ఒక్కరికీ షాక్ కు గురిచేస్తుంది. ఇప్పటికే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి కూరగాయలు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
బాగా పెరిగిన నిత్యావసరాలు, వంట నూనెలు
ఇక ఈ సమయంలో పండుగ వేళ నిత్యవసర వస్తువుల ధరలు, నూనెల ధరలతో పండుగ పూట ఎటువంటి పిండివంటలు చేసుకునే పరిస్థితి లేదని సామాన్య ప్రజలు అంటున్నారు. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల సమయంలో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచడంతో వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి అని తెలుస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కూడా వంట నూనెలపై పడుతుంది.

పది నుండి 30 రూపాయల దాకా పెరిగిన వంట నూనెల ధరలు
గత 15 రోజులుగా చూస్తే ఒక్కో కంపెనీ తమ బ్రాండ్ కిలో వంట నూనె పై పది రూపాయల నుంచి 30 రూపాయల వరకు ధరలను పెంచింది. గత రెండు సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు అశనిపాతంగా మారింది.
ఇంకా ధరలు పెరిగే అవకాశం
దసరా, దీపావళి రోజులలో మాత్రమే కాదు వంటనూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే పెరిగిన వంటనూనెల ధరల వివరాల్లోకి వెళితే వేరుశనగ నూనె ధర లీటరుకు 160 రూపాయలు, రైస్ బ్రాన్ ఆయిల్ ధర లీటరుకు 135 రూపాయలు, పామోలిన్ ఆయిల్ ధర 125 రూపాయలు, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటరుకు 130 రూపాయలుగా ఉంది.
నిత్యావసరాల ధరలు 20 శాతం నుండి 50 శాతానికి పెంపు
ఇక నిత్యావసరాల ధరలు 20 శాతం నుండి 50 శాతానికి పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇక పప్పు, ఉప్పు, చింతపండు ఇలా ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిన నేపథ్యంలో మండిపోతున్న నిత్య అవసరాల ధరలతో ధరల బాదుడుకు లబోదిబోమంటున్నారు.
పెరిగిన ధరలతో ఏం తిని బ్రతకాలి
ఇక కూరగాయలు ఏది ముట్టుకున్నా కిలోకు 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉండడం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. తాజా పరిణామాలతో బియ్యం రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల వేళ కాయకష్టం చేసుకుని బ్రతికే సామాన్యులు పండుగ చేసుకోవడం పక్కనపెట్టి పెరిగిన ధరలతో ఎలా బ్రతకాలి అన్న ఆవేదనలో ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications