స్మితా సబర్వాల్ కు అదిరిపోయే షాకిచ్చిన హరీష్ రావు!!
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజ ఖేద్కర్ వివాదం తర్వాత ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి దేశవ్యాప్తంగా కొత్త చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఐఏఎస్ లో దివ్యాంగుల కోటాపై కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై సోషల్ మీడియా వేదికగా ఆమె పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలకు హరీష్ రావు ఖండన
వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వికలాంగులపైన సంకుచిత దృక్పథంతో ఆమె వ్యాఖ్యలు చేశారని, వారి అర్హతలపై ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.

స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్ధించటం లేదు: హరీష్ రావు
సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో దివ్యాంగులకు కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్ అండ్ డి, డెస్క్ జాబులు వారికి సరిపోతాయని స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైన స్పందించిన హరీష్ రావు స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆమె వ్యాఖ్యలను తాము సమర్ధించడం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణా ప్రభుత్వ రుణమాఫీతో రైతులకు నష్టం
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలపైన, తెలంగాణ ప్రభుత్వ విధానాలపైన హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీకి రేషన్ కార్డు, పిఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారని, ఈ నిబంధనల వల్ల చాలామందికి రుణమాఫీ కావడం లేదని, చాలామంది రైతులకు నష్టం జరుగుతుందని హరీష్ రావు విమర్శించారు. కావాలని కోతలు పెట్టడం కోసమే రేషన్ కార్డును, పీఎం కిసాన్ నిబంధనలను దీనిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
తెలంగాణా ప్రభుత్వ విధానాలపై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డిఏలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదని ఆయన పేర్కొన్నారు ఇక తెలంగాణా వైద్య రంగంలో జరిగిన మార్పులపై మండిపడిన హరీష్ రావు ప్రత్యేక విభాగాలలో పనిచేస్తున్న డాక్టర్లను జిల్లాలకు బదిలీ చేశారని మండిపడ్డారు. ప్రస్తుత విభాగాలలోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఇస్తున్న సూచనలను ప్రభుత్వం తీసుకోవాలని హరీష్ రావు సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications