Telangana Files: తెలంగాణలో కొనసాగుతున్న ఫైల్స్ మాయం ? హైదరాబాద్ లో తాజాగా ఇవే..
తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో హోరాహోరీ పోరు తర్వాత బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతున్న క్రమంలో రాష్ట్రంలోని పలు చోట్ల ప్రభుత్వ ఫైళ్ల మాయం, దగ్ధం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ కూడా రెండు చోట్ల ఫైళ్ల మాయం కొనసాగింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే హైదరాబాద్ లో ఉన్న పలు హెచ్వోడీ కార్యాలయాల్లో ఫైళ్లు మాయం కావడమో, అగ్నిప్రమాదాలు చోటు చేసుకుని కాలిపోవడమో జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి ఆగంతకులు ప్రయత్నించారు. ఆటోలో ఫైల్స్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ కూడా ఉంది. దీంతో ఆటోలో ఫైల్స్ తరలించడాన్ని గమనించిన అధికారులు అడ్డుకున్నారు. అధికారులను చూసి ఫైల్స్‌తో ఉన్న ఆటోను ఆగంతకులు వదిలి వెళ్లిపోయారు.

హైదరాబాద్ లోనే మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలోనూ ఫైల్స్ అదృశ్యం ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం అయ్యాయి. కిటికీ గ్రిల్స్ తొలగించిన దుండగులు ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆఫీసు నుంచి ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానంగా ఉన్నారు.
నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు గుర్తించిన అధికారులు.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన డీసీపీ శ్రీనివాస్.. డైరెక్టర్‌ను కూడా ప్రశ్నించారు. అయితే ఫైల్స్ అదృశ్యంపై సమాచారం లేదని డైరెక్టర్ చెప్పడం విశేషం. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications