శంషాబాద్ లాడ్జీలో భారీ అగ్ని ప్రమాదం: చిక్కుకున్న 50మంది(వీడియో)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగర శివారు శంషాబాద్‌ మండల కేంద్రంలోని శ్రీ అనుపమ రెసిడెన్సీ లాడ్జీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి, రెండో అంతస్తుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

8 అంతస్తులు ఉన్న ఈ భవనంలో చిక్కుకున్న‌ సుమారు 50 మందిలో 28 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మిగిలిన వారిని నిచ్చెనల సాయంతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇదే భవనంలో మూడో అంతస్తులో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

తీవ్రత అధికంగా ఉండటంతో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. వంటగదిలో ఏర్పడిన షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటల చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy Fire Accident occurred in a lodge in Shamshabad on Wednesday morning.
Please Wait while comments are loading...