వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపి కార్పోరేటర్ల డిమాండ్ కు దిగొచ్చిన జీహెచ్ఎంసీ.!తొలి స్టాండింగ్ కమిటీ సమావేశం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జిహెచ్ఎంసి మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ గద్వాల విజయ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. మొట్ట మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశం అయినందున సభ్యులు, అధికారుల పరిచయం కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎన్నికైన సభ్యలకు మేయర్ స్వాగతం పులుకారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కొవిడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన జాప్యం జరిగిందని, ఇందులో ఇతర కారణాలు ఏమి లేవని ఇక నుండి స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్దేశించిన ప్రకారంగా నిర్వహించడం జరుగుతాయని మేయర్ హామీ ఇచ్చారు.

జీహెచ్ఎంసీ తొలి స్టాండింగ్ కమిటీ సమావేశం.. 20 అంశాలకుగాను 18 అంశాలకు ఆమోదం..

జీహెచ్ఎంసీ తొలి స్టాండింగ్ కమిటీ సమావేశం.. 20 అంశాలకుగాను 18 అంశాలకు ఆమోదం..

అత్యంత ప్రాముఖ్యత గల స్టాండింగ్ కమిటీ సమావేశం పాలసీ నిర్ణయాల కమిటీ కాబట్టి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకొని నగర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి. నగర అభివృద్ధికి అందరం కలిసి చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. సభ్యులు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

నగర శానిటేషన్ పై లోతైన చర్చ.. తొలి స్టాండింగ్ కమిటీ సమావేశానికి 14 మంది హాజరు

నగర శానిటేషన్ పై లోతైన చర్చ.. తొలి స్టాండింగ్ కమిటీ సమావేశానికి 14 మంది హాజరు

అంతే కాకుండా మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణాలకు, నాలాల మరమ్మతుల పనులు చేపట్టేందుకు కావాల్సిన భూసేకరణలో కార్పొరేటర్ల పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సభ్యులు ఎక్కువగా శానిటేషన్ పై చర్చించారు. శానిటేషన్ కార్పొరేటర్లతో అడిషనల్ కమిషనర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేయర్ తెలిపారు. మొట్టమొదటి స్టాండింగ్ కమిటికీ 14 మంది సభ్యులు హాజరైనట్టు మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేసారు.

క్రమం తప్పకుండా సమావేశం.. కోవిడ్ తీవ్రతతో గతంలో వాయిదా పడ్డ సమావేశాలు

క్రమం తప్పకుండా సమావేశం.. కోవిడ్ తీవ్రతతో గతంలో వాయిదా పడ్డ సమావేశాలు

మల్లాపూర్ కార్పొరేటర్ పన్నల దేవేందర్ రెడ్డి, చావని కార్పొరేటర్ ముహమ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, కుర్మగుడా కార్పొరేటర్ శ్రీమతి మహపరా, రియసత్ నగర్ మిర్జా ముస్తఫా బేగ్, శ్రీమతి పర్వీన్ సుల్తానా ఘన్సి బజార్, మందగిరి స్వామి కార్వాన్, శ్రీమతి, బాత జాబీన్ విజయనగర, ఇ.విజయకుమార్ గౌడ్ అంబర్ పేట్, మొహమ్మద్ రషీద్ ఫరాజుద్ది న్ షేక్ పేట్, సి.ఎన్.రెడ్డి రహమత్ నగర్, మందాడి శ్రీనివాసరావు కె పి హెచ్ బీ కాలనీ నుండి హాజరయ్యారు.

Recommended Video

Weather Forecast : New Low Pressure, Heavy Rains Again In AP & TS || Oneindia Telugu
నగర సమూల అభివృద్దికి సహకారం అందించాలి.. స్టాండింగ్ కమిటీలో సభ్యులకు మేయర్ విన్నపం..

నగర సమూల అభివృద్దికి సహకారం అందించాలి.. స్టాండింగ్ కమిటీలో సభ్యులకు మేయర్ విన్నపం..

అంతే కాకుండా వై. ప్రేమ్ కుమార్ ఈస్ట్ ఆనంద్ బాగ్, కుమారి సామల హేమ, శ్రీమతి కుర్మా హేమలత కార్యదర్శి లక్ష్మి, ఇంజనీర్ ఇన్ చీఫ్ జియా ఉద్దీన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, యస్ అర్ డి పి చీఫ్ ఇంజనీర్ దేవానంద్, సిసిపి దేవేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్లు బి.సంతోష్, ప్రియాంకఅలా, జయరాజ్ కెన్నెడీ, విజయ లక్ష్మి సరోజ, జోనల్ కమిషనర్లు శ్రీమతి పంకజ, మమత, రవి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎంట మాలోజి చీఫ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

English summary
GHMC First Standing Committee Meeting was chaired by Mayor Gadwala Vijaya Lakshmi. The mayor welcomed the elected members after the completion of the introductory program for the members and officers as it was the first standing committee meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X