బ్లాక్ డే ఎఫెక్ట్: పాతబస్తీలో భారీ బందోబస్తు
హైదరాబాద్: డిసెంబర్ 6 బ్లాక్ డే నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో మంగళవారం సాయంత్రం భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. పాతబస్తీలో 60 సున్నితమైన, 10 అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు.
Recommended Video

Babri Masjid Demolition 25th anniversary : Security Heightened

భద్రతా చర్యల దృష్ట్యా 3,500 మందికి పైగా పోలీసులను మోహరించామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి రేపటి(బుధవారం)తో ఇరవై ఐదేళ్లు పూర్తవుతుంది.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రెండ్రోజులపాటు 144సెక్షన్ విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications