etela rajender : ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై-అసెంబ్లీ కార్యదర్శికి సమర్పణ-కేసీఆర్‌పై నిప్పులు

టీఆర్‌ఎస్‌తో విభేదాలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్‌ ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్‌బై చెప్పేశారు. ఎల్లుండి బీజేపీలో చేరికకు ముహుర్తం ఖాయం కావడంతో ఆయన తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. గన్‌పార్కులోని తెలంగాణ అమర వీరుల స్ధూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న రాజీనామాను ఆయన అసెంబ్లీ కార్యదర్శికి సమర్ఫించారు. ఎలాగో పార్టీ కూడా మారుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా ఆమోదం లాంఛనమే అని తెలుస్తోంది.

 ఎమ్మెల్యే పదవికీ ఈటల గుడ్‌బై

ఎమ్మెల్యే పదవికీ ఈటల గుడ్‌బై

టీఆర్‌ఎస్‌ అధిష్టానంతో విభేదాల నేపథ్యంలో మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ నేత ఈటల రాజేందర్‌ ఇవాళ ఎమ్మెల్యే పదవినీ వదులుకున్నారు. ఎలాగో బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్పీకర్‌ పార్మాట్‌లో తయారు చేసిన రాజీనామా లేఖను ఆయన అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. దీంతో టీఆర్‌ఎస్‌తో ఆయన బంధం పూర్తిగా తెగినట్లయింది.

 ఎల్లుండి బీజేపీలో చేరిక

ఎల్లుండి బీజేపీలో చేరిక

టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవిని వదులుకున్న ఈటల రాజేందర్‌ ఇక తన ప్రయాణం బీజేపీతో కొనసాగించేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఆయన ఎల్లుండి బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. 14న ఢిల్లీ వెళ్లనున్న ఈటల.. పార్టీ ముఖ్యనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు కావడంతో ఈటల ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్‌బై చెప్పేశారు.

 కేసీఆర్‌ పాలనకు ఘోరీ కడతానన్న ఈటల

కేసీఆర్‌ పాలనకు ఘోరీ కడతానన్న ఈటల

ఎమ్మెల్యే పదవి వదులుకుంటూ రాజీనామా లేఖ సమర్పించిన ఈటల.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలనకు ఘోరీ కడతానని ఈ సందర్భంగా ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని, కానీ కేసీఆర్‌ మాత్రం నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ దగ్గర వందల కోట్లు ఉన్నాయని,వాటిని గుమ్మరించి హుజురాబాద్‌లో గెలవాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు. హుజురాబాద్ ఉపఎన్నిక కురుక్షేత్రమేనన్నారు. అక్కడ గెలిచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతానన్నారు.

 కేసీఆర్‌వి వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలు

కేసీఆర్‌వి వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలు

రాజీనామా సమర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ వద్దకు వచ్చిన తనను, మరో నేత ఏనుగు రవీందర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై ఈటల మండిపడ్డారు. కేసీఆర్‌వి వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలని ఈటల విమర్శించారు. కేసీఆర్‌ వాటిని మానుకోవాలన్నారు. అసెంబ్లీ గేట్ వద్ద ఏనుగు రవీందర్‌రెడ్డిని సైతం అనుమతించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తానని రాజీనామా సమర్పించిన అనంతరం ఈటల వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+