• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు: ప్రత్యేకతలెన్నో, భారీగా తరలివచ్చిన భక్తులు

|

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ప్రత్యేకగా నిలిచే ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది కూడా భక్త వత్సలుడిగా దర్శనమిస్తున్నాడు. గత 64 ఏళ్లుగా ఎంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న ఖైరతాబాద్ గణేశుడు ఈసారి సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా దర్శమిస్తున్నాడు.

గణపతి శోడశ రూపలు పూజలు: ఒక్కో రూపం విశిష్టత తెలుసుకోండి

ఏడు ఆదిశేషుల పడగల నీడలో.. ఏడు ముఖాలతో.. 14 చేతులతో లక్ష్మీ, సరస్వతి సమేతుడై 57 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో నిండైన రూపంలో భక్తులకు కనువిందు చేస్తున్నాడు.

గణేష్ చతుర్థి: వినాయక పూజా విధానం, ఏం కావాలి, ఎలా చేయాలి?

11రోజులపాటు పూజలు

11రోజులపాటు పూజలు

గురువారం నుంచి పదకొండు రోజుల పాటు పూజలందుకోనున్నాడు ఈ గణనాథుడు. గురువారం నాడు ఉదయం నిర్వాహకులే తొలి పూజ నిర్వహించారు. అనంతరం అపద్ధర్మ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. ఖైరతాబాద్ గణనాథుడి ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతామని చెప్పారు.

ప్రత్యేక అలంకరణ.. భక్తుల సందర్శన

ప్రత్యేక అలంకరణ.. భక్తుల సందర్శన

వినాయక చవితి సందర్భంగా శ్రీ సప్తముఖ కాలసర్పమహాగణపతి పూజా కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. తొలుత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలు స్వహస్తాలతో రూపొందించిన 75 అడుగుల కండువా, జంజాన్ని స్వామి వారికి సమర్పించారు. అంతకుముందు వాటిని సెన్సేషన్ థియేటర్ రోడ్ మీదుగా గుర్రపు బగ్గీలో మేళ తాళాలు, కోలాటల మధ్య ఊరేగిస్తూ మండపానికి చేరుకున్నారు. అలాగే గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన గరిక మాల (75 అడుగులు) అలంకరించారు. తొలిపూజ అనంతరం భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించారు. దీంతో భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు.

సప్తముఖుడి దర్శనం.. సర్పదోష నివారణం...

సప్తముఖుడి దర్శనం.. సర్పదోష నివారణం...

ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడికి ఓ ప్రత్యేక ఉంది. ప్రతి ఏడాది గణేశుడి ప్రతిమకు ఓ పురాణేతిహాసం ఉంటుంది. భక్తుల కష్టాలు తొలగించే రూపాలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తుండగా, ఈ ఏడాది భక్తుల సర్పదోషాలను నివారించేందుకు ఈ సప్తముఖుడికి సిద్ధాంతులు, వేదపండితులు రూపకల్పన చేయగా, మహా శిల్పి రాజేంద్రన్ ఆ రూపాన్ని మనకు సాక్షాత్కరింప చేశారు. కాగా, సప్తముఖ కాలసర్ప మహాగణపతిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని విగ్రహ రూపకర్త జ్యోతిర్మయ పీఠాధిపతి విఠల్ శర్మ దివ్య జ్ఞాన సిద్ధాంతి వివరించారు. ఏడు పడగలు ఏడు కాలాలను సూచిస్తుందని, ముఖ్యంగా సర్పదోష నివారణ కోసం కాలహాస్తీ మహాక్షేత్రానికి వెళ్లి వస్తే ఎలాంటి పుణ్యం దక్కుతుందో ఈ మహాదేవుడి దర్శనం ద్వారా అలాంటి ఫలితం వస్తుందన్నారు. పదకొండు రోజుల పాటు దూప, దీప నైవేద్యాలతో వ్రతకల్పాన్ని నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో పంట పొలాలు సమృద్ధి పండి, ప్రజలకు శుభాలు చేకూరుతాయన్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు

ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రతి రోజూ దర్శనం కోసం భక్తులు వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకుని గణపతి మండపం వైపు వచ్చే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ బుధవారమే ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు, వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు. ఈ 11రోజులపాటు మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ నుంచి వాహనాలను ఖైరతాబాద్ గణేశ్ మండపం వైపు అనుమతించరు. ప్రభుత్వ మింట్ కంపౌండ్ వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు.

-రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి వాహనాలకు ఈ మార్గంలో ఎంట్రీ లేదు. ఆ వాహనాలను సంత్‌నిరంకారీ వైపు మళ్ళిస్తారు. రాజ్‌దూత్ హోటల్, ఖైరతాబాద్ మార్కెట్ మార్గం నుంచి వచ్చే వాహనాలను మండపం వైపు అనుమతించరు. ఈ వాహనాలను ప్రింటింగ్ ప్రెస్, మార్కెట్ మార్గాల్లో మళ్లిస్తారు. ఈ మార్గంలో ఆంక్షలు 13వ తేదీ నుంచి 23 వరకు అమల్లో ఉంటాయని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. కాగా, గురువారం ఉదయం నుంచే ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Khairatabad Ganesh Utsav Committee, which oversees the Ganesh festivities at Khairatabad, in association with the Hyderabad police has made tight security arrangements for the 11-day festivities that are set to begin form Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more