జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి కాటా సంచలన ఉత్తర్వులు!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ అమ్రపాలి కాటా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన మార్క్ పాలన చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు పారిశుద్ధ్య కార్మికులను పరుగులు పెట్టిస్తూనే, నగరాన్ని స్వచ్చతలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నగర పరిశుభ్రతలో భాగంగా నిలిచే అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఆమ్రపాలి కాటా హెచ్చరికలు
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అడ్వర్టైజ్ పోస్టులు, యాడ్స్ పైన జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాటా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఎవరైనా గోడల పైన పోస్టర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆమ్రపాలి కాటా హెచ్చరికలు జారీ చేశారు.

పోస్టర్లు, బ్యానర్ లపైన బ్యాన్
నేటి నుంచి జిహెచ్ఎంసి పరిధిలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ పైన పూర్తిగా బ్యాన్ విధించిన ఆమ్రపాలి కాట ఎవరైనా పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చివరకు గోడల పైన సినిమా పోస్టర్లు వాల్ రైటింగ్స్ ను కూడా నిషేధిస్తున్నట్టు ఆమ్రపాలి కాటా వెల్లడించారు.
వాల్ పోస్టర్లతో పాటు, వాల్ పెయింటింగ్స్ పైన కూడా సీరియస్ గా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ఎవరు ఎటువంటి పోస్టర్లను అతికించకూడదని స్పష్టం చేశారు. సినిమా పోస్టర్లు వ్యాపార ప్రకటనలకు సంబంధించిన పోస్టర్లు అయినా సరే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. వాల్ పోస్టర్లతో పాటు, వాల్ పెయింటింగ్స్ పైన కూడా సీరియస్ గా వ్యవహరించాలని అమృపాలి కాటా అధికారులకు సర్కులర్ జారీ చేశారు
కీలక నిర్ణయం వెనుక కారణమిదే
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నగర కమిషనర్ ఆమ్రపాలి కాట ఆ సర్కులర్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే హైదరాబాద్లో హైడ్రా ఓవైపు చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ దూకుడుగా ముందుకు వెళుతుంటే, మరోవైపు మతపరమైన కార్యక్రమాలలో డీజేల వినియోగాన్ని నిషేధించనున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.
ఆమ్రపాలి నిర్ణయంపై చర్చ
ఇక ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లను బ్యాన్ చేస్తూ తాజాగా అమ్రపాలి కాటా కీలక ఆదేశాలు జారీ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇకపై హైదరాబాద్ లో ఎక్కడా వాల్స్ పైన పోస్టర్లు, రాతలు కనిపించకుండా క్లీన్ గా ఉంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు అమలవుతుందో తెలియాల్సి ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications