బాలికపై పలుమార్లు యువకుడి అత్యాచారం: గర్భం దాల్చిన బాలిక

Subscribe to Oneindia Telugu

మహబూబాబాద్‌ : ఓ యువకుడు 14 సంవత్సరాల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో సెటిల్‌మెంట్‌ చేసేందుకు పెద్ద మనుషులు యత్నించారు. అయితే అనూహ్యంగా మీడియా ప్రవేశంతో పరారయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐ ముత్తులింగయ్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్‌ మండం జమాండ్లపల్లికి చెందిన బాలికపై అదే గ్రామంలోని కడమంచి సంజీవ అనే యువకుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది.

Girl raped and impregnated in Mahaboobabad district

బాలికకు ఈ నె 12న జ్వరం రావడంతో అస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా మూడు నెల గర్భవతి అని తేలింది. కుటుంబ సభ్యులు బాలికను నిలదీయగా కడమంచి సంజీవ తనపై అత్యాచారం చేసిన విషయాన్ని ఎవరితోనైనా చెబితే చంపివేస్తాని బెదిరించినట్లు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పెద్ద మనుషులను ఆశ్రయించగా మీడియా ప్రవేశంతో ఉడాయించినట్లు పోలీసు తెలిపారు.

Eight year old girl raped by neighbor in Delhi

కాగా, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముత్తు లింగయ్య తెలిపారు. అలాగే అత్యాచారానికి పాల్పడిన యువకుడి పై పోక్సో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే పంచాయితీ చేసిన నలుగురు పెద్ద మనుషులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 14 year old girl has been made pregnant raping her in Mahaboobbabd district of Telangana
Please Wait while comments are loading...