భర్త ఆలస్యమవుతుందనడంతో.. ఆమె బయలుదేరింది: మధ్యలోనే ఊహించని విధంగా..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజధానిలో మరో చైన్ స్నాచింగ్ ఉదంతం వెలుగుచూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వివాహితపై స్ప్రే కొట్టి.. ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు.

పోలీసుల కథనం ప్రకారం.. నవీన్‌శర్మ, ప్రత్యూష(25)దంపతులు చైతన్యపురి ఫణిగిరి కాలనీలో నివసిస్తున్నారు. నవీన్‌శర్మ రామాలయంలో పూజారిగా పనిచేస్తుండగా, ప్రత్యూష ఇంటి వద్దే ఉంటోంది. శనివారం సాయంత్రం ప్రత్యూష కూడా రామాలయం వెళ్లింది.

Gold chain snatched from woman

అయితే తనకు ఆలస్యం అవుతుందని భర్త చెప్పడంతో.. ఆమె ఒంటరిగా నడుచుకుంటూ ఇంటి వైపు బయలుదేరింది. ఇంతలో దేవాలయానికి కొద్ది దూరంలోనే ఎదురుగా వచ్చిన ఓ దుండగుడు ఆమె ముఖంపై స్ప్రే కొట్టాడు. తేరుకునేలోపే ఆమె మెడలోని బంగారు గొలుసుతో ఉడాయించాడు. శనివారం రాత్రి 9గం. సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సరూర్‌నగర్‌లో ఇదే తరహాలో ముఖంపై స్ర్పే కొట్టి స్నాచింగ్‌ జరిగిన ఘటన మరవకముందే చైతన్యపురిలో మరో సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In yet another frightening incident, a woman returning to her home from a temple was robbed by a man after spraying unidentified liquid on her face at Chaitanyapuri police station limits on Saturday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి