Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 40వేల ఉద్యోగాలు భర్తీ!

తెలంగాణ నిరుద్యోగులకు సూపర్ న్యూస్. ఉద్యోగాల కోసం ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న నిరుద్యోగులు త్వరలోనే 40,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి కసరత్తు జరుగుతుందని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం తమ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

నిరుద్యోగులకు శుభవార్త
తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా 262.78 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేసిన ఆయన ఈ సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పేర్కొన్న ఆయన తొలి సంవత్సరంలో 60,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని పేర్కొన్నారు.

Good news for the unemployed 40 000 govt jobs to be filled soon in telangana

Take a Poll

40 వేల ఉద్యోగాల భర్తీ
త్వరలో మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, దీని కోసం కసరత్తు జరుగుతుందని తెలిపారు. రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

నిరుద్యోగులు నిరాశ పడాల్సిన అవసరం లేదన్న సీఎం రేవంత్
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని, తెలంగాణ రాష్ట్రంలో విద్య పైన, ఉపాధి పైన సాగునీటి రంగాలపైనా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, నిరుద్యోగులు నిరాశ పడాల్సిన అవసరం లేదని, నిరుద్యోగుల ఉద్యోగ భర్తీకి తాము పెద్దపీట వేస్తామని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటనతో నిరుద్యోగులలో ఆశలు
రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి ముందుకు సాగుతున్నామని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటనతో నిరుద్యోగులలో ఆశలు మళ్లీ చిగురించాయి. త్వరలో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఊపిరి పోసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+