కార్తీక పౌర్ణమి వేళ శుభవార్త.. వేములవాడ రాజన్న ఆలయానికి త్వరలో మహర్దశ!
కార్తీక పౌర్ణమి వేళ తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజన్న ఆలయం విషయంలో భక్తులు సంతోషపడేలా ఒక శుభవార్త బయటకు వచ్చింది. దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ రాజన్న ఆలయానికి త్వరలో మహర్దశ పట్టబోతుంది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రకటించారు.
వేములవాడ మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చించిన కొండా సురేఖ
నేడు సచివాలయంలో దేవాదాయ శాఖ పేషీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో పాటు దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వేములవాడ ఆలయ అభివృద్ధి కార్యక్రమాల పైన, మాస్టర్ ప్లాన్ అమలుపైన కొండ సురేఖ వారితో చర్చించారు.

అభివృద్ధి నిధుల కోసం సీఎంతో చర్చిస్తానన్న కొండా సురేఖ
వేములవాడ ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కొండ సురేఖ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం తాను సీఎం రేవంత్ రెడ్డి తోను, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతోను చర్చిస్తానని పేర్కొన్నారు. వేములవాడ దేవాలయానికి సరికొత్త కళను తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.
వేములవాడ ఆలయం వద్ద పరిస్థితి ఇలా
వేములవాడ ఆలయానికి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా వస్తారు. అయితే ఆలయానికి వస్తున్న భక్తులకు తగ్గట్టు వేములవాడ ఆలయంలో అభివృద్ధి జరగలేదు. ఆలయ ప్రాంగణం చాలా ఇరుకుగా ఉంటుంది. అలాగే ఆలయానికి వెళ్ళే మార్గాలు కూడా చాలా ఇరుకుగా ఉంటాయి. వీటిని అభివృద్ధి చెయ్యాలని గతంలోనూ ప్రభుత్వాలు భావించాయి. కానీ ఎవరూ వేములవాడ ఆలయ అభివృద్ధికి కృషి చెయ్యలేదు.
వేములవాడ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కొండా సురేఖ ప్రకటనతో హర్షం
అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి పైన దృష్టి సారిస్తున్న నేపథ్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. వేములవాడ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పడం రాజన్న భక్తులందరికీ సంతోషాన్ని కలిగించింది. కార్తీక మాసంలో వేములవాడ ఆలయ అభివృద్ధి వార్త ప్రతి ఒక్కరిని హర్షాతిరేకాలతో ముంచెత్తుతుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications