పండుగ చేసుకునే వార్త.. నా దారి జాతీయ రహదారి అంటున్న సీఎం రేవంత్!

తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టబోతుంది. రోడ్లు భవనాల శాఖకు చెందిన పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించడానికి రేవంత్ సర్కార్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1767 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం లేదా జాతీయ రహదారులకు అనుసంధానించాలని ప్లాన్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది.

రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ విజయవాడ తో సహా రాష్ట్రంలోని ముఖ్యమైన రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక రోడ్లకు విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడానికి లేదా జాతీయ రహదారులకు కనెక్ట్ చేయడానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Good news revanth reddy govt proposals to send center to expand state roads as national highways

నివేదిక సిద్ధం చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్గదర్శకాలు అనుగుణంగా ఆయా రోడ్ల వివరాలు తోటి నివేదికలను సిద్ధం చేసి మరోసారి కేంద్రం ముందు పెట్టనుంది. కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్రంలో అప్గ్రేడ్ చేయాల్సిన రోడ్లకు సంబంధించి నివేదికను సమర్పించడం కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలను కలుపుతూ రోడ్ల విస్తరణ
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలను కనెక్ట్ చేస్తూ ఈ రోడ్లు ఉండేలా రూపొందించి ఈ రహదారులు పూర్తయితే ఏ విధంగా అభివృద్ధి సాధ్యమవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 16 రహదారులను ఎంపిక చేసి వాటికి సంబంధించిన ప్లాన్ తో కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేయనున్నారు. మరి ఆ ప్రధాన రహదారుల విషయానికి వస్తే..

రాష్ట్రం ప్రతిపాదించే రోడ్ల వివరాలు ఇవే

1.చౌటుప్పల్ (ఎన్ హెచ్ 65) అమనగల్లు, షాద్నగర్, సంగారెడ్డి
2. పుల్లూరు (ఎన్ హెచ్ 44).. అలంపూర్, జెట్ప్రోల్, పెంటవల్లి, కొల్లాపూర్ ,లింగాల ,అచ్చంపేట, డిండి( ఎన్ హెచ్ 765) దేవరకొండ (ఎన్ హెచ్ 167) మల్లేపల్లి నల్గొండ (ఎన్ హెచ్ 565)
3. వనపర్తి (ఎన్ హెచ్ 167) కొత్తకోట, గద్వాల, మంత్రాలయం,
4. మన్నెగూడ (ఎన్ హెచ్163) వికారాబాద్, తాండూరు, జహీరాబాద్, బీదర్ (ఎన్ హెచ్ 50)

5. భువనగిరి (ఎన్ హెచ్ 163), చిట్యాల (ఎన్ హెచ్ 65)
6. కరీంనగర్ కూడలి (ఎన్ హెచ్ 563), సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం (ఎన్ హెచ్ 161)
7.కరీంనగర్ (ఎన్ హెచ్ 563) రాయపట్నం (ఎన్ హెచ్ 63) 8.జగ్గయ్యపేట (ఎన్ హెచ్ 65) వైరా కొత్తగూడెం ( ఎన్ హెచ్30)
9.సారపాక (ఎన్ హెచ్ 30) ఏటూరు నాగారం (ఎన్ హెచ్ 163)

10.ఎర్రవల్లి చౌరస్తా (ఎన్ హెచ్ 44) గద్వాల, రాయచూరు (ఎన్ హెచ్ 167)
11.జగిత్యాల (ఎన్ హెచ్ 63) పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, కిష్టంపేట, కాల్వపల్లి ,మోరంచపల్లి , రామప్ప దేవాలయం, జంగాలపల్లి (ఎన్ హెచ్ 163)
12.సిరిసిల్ల (ఎన్ హెచ్ 365 బి) వేములవాడ, కోరుట్ల
13. భూత్పూర్ ,నాగర్ కర్నూల్, మన్ననూర్, మద్దిమడుగు, గంగాలకుంట, శ్రీగిరిపాడు

14. దుద్దెడ (ఎన్ హెచ్ 365 బి) కొమురవెల్లి, యాదగిరిగుట్ట, రాయగిరి చౌరస్తా,
15. పెద్దపల్లి కాటారం ( ఎన్ హెచ్ 353 సి)
16. మరికల్ (ఎన్ 167) నారాయణపేట రాంసముద్ర (ఎన్ 150) ఈ రోడ్లను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు ప్రతిపాదించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే ప్లాన్ లో భాగంగా కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంలో వెనక్కి తగ్గేదే లేదు అన్న చందంగా రేవంత్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+