కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ అభ్యంతరాలు పట్టించుకోవద్దు, మీ పని కానివ్వండి: కన్నడ మంత్రికి హరీశ్ ఫోన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/బెంగళూరు: తెలంగాణ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి చేప‌ట్టిన రాజోలిబండ డైవర్షన్‌ స్కీం(ఆర్డీఎస్‌) ప‌నుల‌ను ఆపొద్ద‌ని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావు క‌ర్ణాట‌క‌ నీటి పారుదల శాఖ మంత్రి పాటిల్‌కి విజ్ఞ‌ప్తి చేశారు.

కర్నూలు జిల్లా కలెక్టర్‌ విజయ్‌మోహన్ రాసిన లేఖ కార‌ణంగా ఆనకట్ట ఆధునికీకరణ, పూడికతీత పనులను ఆపొద్ద‌ని హ‌రీశ్‌రావు విన్న‌వించారు. బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ ప్ర‌కారం తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు అందించేప‌నుల‌పై ముందుకు వెళ్లాల‌ని హ‌రీశ్ కోరారు.

Harish Rao has phoned Karnataka Minister

ఆర్డీఎస్‌ పనులు మొదలు పెడితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కర్నూలు కలెక్టర్ క‌ర్నాట‌కకు ఇటీవ‌లే లేఖ రాసిన విష‌యం తెలిసిందే.

వారం రోజుల‌ క్రితం ఆనకట్ట ఆధునీకరణ పనులకు కర్నాట‌క‌ సన్నాహాలు చేపట్టగా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో పోలీసులు ఆ ప‌నుల‌ను అడ్డుకున్నారు. త‌మ ప్రాంతం దిగువకు ఉండ‌టంతో ఈ ప‌నుల‌వ‌ల్ల నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా, తమకు రావాల్సిన న్యాయమైన వాటానే వాడుకుంటున్నామని తెలంగాణ వాదిస్తోంది.

English summary
Telangana Minister Harish Rao on Friday has been phoned to Karnataka Minister Patil on RDS issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X