వంద సీట్లా, జెండా పట్టేవాళ్లే లేరు: కాంగ్రెసుకు హరీష్ రావు చురకలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: కాంగ్రెసు దుకాణం ఖాళీ అవుతుంటే ఆ పార్టీ నాయకులు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిార్ఎస్) నాయకుడు హరీష్ రావు ఎద్దేవా చేశారు. జెండా పట్టేందుకు కాంగ్రెసుకు మనుషులే లేరని ఆయన అన్నారు.

కాంగ్రెసు దుకాణం ఖాళీ అవుతుంటేవంద సీట్లు ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసుకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పాలని, టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో వంద కారణాలు చెబుతామని ఆయన అన్నారు.

  హరీష్ రావు స్పీచ్ @ గీతం యూనివర్సిటీ
  అభివృద్ధిని చూసే వస్తున్నారు

  అభివృద్ధిని చూసే వస్తున్నారు

  టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరుతున్నారని హరీష్ రావు చెప్పారు. ప్రజల కష్టాలు తెలిసనవాళ్లం కాబట్టి ఉద్మమ స్పూర్తితో పనిచేస్తామని ఆయన చెప్పారు. కరీంనగర్ మండలంలోని బిజెపి, కాంగ్రెసుల నుంచి పలువురు సర్పంచులు ఎంపీటీసీలు, కార్యకర్తలు హరీష్ రావు, ఈటెల రాజేందర్ సమక్షంలో టీఆర్ఎస్‌లే చారు.

  తెలంగాణకు అన్యాయమే చేసింది

  తెలంగాణకు అన్యాయమే చేసింది

  స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెసు పార్టీ పరిపాలనలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని హరీష్ రావు అన్నారు. కరీంనగర్‌ను తాకుతూ వెళ్తున్న గోదావరి నీళ్లను ఉభయ గోదావరి జిల్లాల్లో పారించి, కరీంనగర్‌లో రక్తం పారించిన ఘనత కాంగ్రెసుదేనని ాయన అన్నారు.

   అద్భుత రూపకల్పన చేశాం

  అద్భుత రూపకల్పన చేశాం

  మూడున్నరేళ్లలో గోదావరి నదిపై అద్భుతమైన రూపకల్పన చేశామని, ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నే రీతిలో కరీంనగర్‌ను ధాన్యాగారంగా మారుస్తామని హరీష్ రావు అన్నారు. గోదావరి నీటితో తెలంగాణను దేశానికి అన్నం పెట్టే కల్పవల్లిగా మారుస్తామమని చెప్పారు.

  మొగులు చూడాల్సిన అవసరం లేదు

  మొగులు చూడాల్సిన అవసరం లేదు

  రైతులు ఇక నుంచి వానల కసం మొగులును చూడాల్సిన అవసరం లేదని హరీష్ రావు అన్నారు. గోదావరి, కడెం, ప్రాణహిత- ఇలా ఏ నది నుంచి నీళ్లు వచ్చినా ప్రతి చుక్కా కరీంనగర్ నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆయన అన్నారు.

  జాతీయ పార్టీలు బిచ్చగాళ్లను చేస్తాయి

  జాతీయ పార్టీలు బిచ్చగాళ్లను చేస్తాయి

  రాష్ట్రాలను జాతీయ పార్టీలు బిచ్చగాళ్లను చేస్తాయని హరీష్ రావు అన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో మీట నొక్కితే గానీ ఇక్కడి సిఎం కదిలే పరిస్థితి లేదని అన్నారు. టీఆర్ఎస్ ఏ పనిచేసినా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana minister and Telngana Rastra Samithi (TRS) leader Harish Rao mocked at Congressin Karimnagar meeting.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి