Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ లో కుండపోత వర్షం... కీలక ప్రాంతాలు జలదిగ్బంధం

హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలు వర్షాలతో తడిసి ముద్ద అవుతున్నాయి. వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సిటీలోని పలు ప్రాంతాలలో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో నగరంలో అనేక ప్రాంతాలలో భారీ ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. సెక్రటేరియట్ బస్ స్టాప్, సిటీ సెంట్రల్ జోన్ నీటమునిగాయి. ఇక సెక్రటేరియట్ ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షేక్‌పేట, లక్డికాపూల్, సికింద్రాబాద్ ప్రాంతాలతో సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. షేక్‌పేటలో గంటలోపు 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 5.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్‌లో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Heavy rain lashed many parts of Hyderabad imd alert on hyderabad rains

చెరువులను తలపిస్తున్న రహదారులు
ఖైరతాబాద్ వాటర్ బోర్డు కార్యాలయం వెనుక ఒక ప్రైవేట్ స్కూల్ వర్షాల కారణంగా నీట మునిగింది. వందలాది మంది విద్యార్థులు నీళ్ళలోనే చిక్కుకుపోయారు. ఇక ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద నిలిచిపోయిన వర్షపు నీటితో ఖైరతాబాద్ పంజాగుట్ట మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

మళ్ళీ భారీ వర్షం పడుతుందని హెచ్చరిక
తెలుగు తల్లి ఫ్లైఓవర్, నారాయణగూడ ఫ్లైఓవర్ పైన కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాలలో భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రజల నుండి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదులు వెల్లువగా మారాయి. ఈ సాయంత్రం వరకు మొత్తం GHMC ప్రాంతానికి భారీ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

భారీ వర్షాలు నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తం
భారీ వర్షాలు నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. విపత్తు, ప్రతిస్పందన బృందాలు నీరు నిలిచిన ప్రాంతాలలో నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు. నల్గొండ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా గత కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+