బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్: పోలీసుల అదుపులో నటి హేమ.. ఎందుకంటే
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావలసి ఉంది. అయితే హేమ విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరు పోలీసులు నటి హేమను అరెస్ట్ చేసినట్టు సమాచారం.
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. లోతుగా దర్యాప్తు
గత కొద్ది రోజుల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.. టాలీవుడ్ లోనూ పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీ నటులతో పాటు, సీరియల్ నటులు, కర్ణాటక రాష్ట్రంలోని సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ దొరకటంతో పోలీసులు ఈ రేవ్ పార్టీ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న నటి హేమ
ఈ రేవ్ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారు. అయితే హేమ కొన్ని వీడియోలు రిలీజ్ చేసి బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పి జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఆమె పాల్గొన్నారని చెప్పటంతో నటి హేమ అభాసుపాలయ్యారు. అంతే కాదు బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ రక్తాన్ని సేకరించి బ్లడ్ టెస్ట్ కోసం పంపగా టెస్టులలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది.
హేమకు విచారణకు హాజరుకావాలని రెండు సార్లు నోటీసులు
దీంతో హేమకు బెంగళూరు పోలీసులు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే మొదట తను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని, మరొక రోజు విచారణకు హాజరవుతానని హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. దీంతో మరొకమారు ఆమెకు నోటీసులు జారీ చేసిన పోలీసులు జూన్ 1వ బెంగళూరు సిసిబి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో హేమ
అయితే హేమ సి సి బి పోలీసుల ముందు హాజరు కాకపోవడంతో నేడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన సీసీబీ పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రేపు హేమను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications