హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోంగార్డు అరెస్ట్: 30బైక్‌ల స్వాధీనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసు విభాగంలోనే పనిచేస్తూ ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ఓ హోంగార్డును పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతనితోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను బుధవారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పశ్చిమ మండలం డిసిపి వెంకటేశ్వరరావు వెల్లడించారు.

కరీంనగర్‌కు జిల్లాకు చెందిన ఎస్ బిక్షపతి రాజు అలియాస్ రాజు (33) కరీంనగర్ జిల్లాలో హోంగార్డుగా ఎంపికై హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహించేవాడు. 1996లో ఇతనికి గంగ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అనంతరం 2011వ సంవత్సరంలో సునీత అనే మరో యువతిని ప్రేమించి, పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి వివాహం చేసుకున్నాడు.

వివాహం జరిగిన కొంత కాలానికి బిక్షపతి రాజుకు ముందే వివాహం అయిన విషయం తెలియడంతో పోలీసులను సునీత ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిక్షపతి రాజును అరెస్టు చేసి జగిత్యాలలోని జైలుకు తరలించారు.

జైలులో అంజయ్యతో పరిచయం అయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సునితతో మాట్లాడుకొని కేసు ఉపసంహరించుకునేలా చేశాడు. దీంతో కేసులు కొట్టేశారంటూ తిరిగి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. కాగా, ఇతడిని డిప్యుటేషన్‌పై హైదరాబాద్ నగరానికి పంపించారు.

హోంగార్డు అరెస్ట్

హోంగార్డు అరెస్ట్

పోలీసు విభాగంలోనే పనిచేస్తూ ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ఓ హోంగార్డును పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హోంగార్డు అరెస్ట్

హోంగార్డు అరెస్ట్

కేసు వివరాలను బుధవారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పశ్చిమ మండలం డిసిపి వెంకటేశ్వరరావు వెల్లడించారు.

వాహనాల స్వాధీనం

వాహనాల స్వాధీనం

హోంగార్డు వద్ద నుంచి 30 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వాహనాల స్వాధీనం

వాహనాల స్వాధీనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ. 15 లక్షల వరకు ఉంటుందని డిసిపి చెప్పారు.

ప్రస్తుతం నగరంలోని ఓ ఐజి నివాసంలో విధులు నిర్వహిస్తున్న బిక్షపతి.. జైల్లో పరిచయం అయిన అంజయ్యను నగరంలో కలిశాడు. ఆ సమయంలో అంజయ్య తన స్నేహితుడు దేవేందర్‌ను పరిచయం చేశాడు. ముగ్గురు కలిసి వివిధ అంశాలపై చర్చించుకొని త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన చేసుకున్నారు. ఇందులో భాగంగా అంజయ్య, దేవేందర్.. తాళం వేసి ఉన్న బైక్‌లను ఎలా దొంగతనం చేయాలో బిక్షపతికి నేర్పించారు. దీంతో బిక్షపతి సొంతంగా నగరంలో పలు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను చోరీలు చేయడం మొదలు పెట్టాడు.

ఇలా చోరీ చేసిన వాహనాలను కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ వచ్చాడు. విక్రయించే సమయంలో ఈ బైక్‌కు వాహనదారులు సరిగా ఫైనాన్స్ చెల్లించక పోవడంతో వీటిని సీజ్ చేశామని, ఫైనాన్స్ కార్యాలయంలో వాహనానికి సంబంధించిన ఒరిజనల్ కాగితాలు ఉన్నాయని చెప్పేవాడు. దీంతో ఇది నిజమేనని నమ్మిన వారు సదరు బైక్‌లను కొనుగోలు చేశారు.

కాగా, కొంత కాలంగా ద్విచక్రవాహనాలు చోరికి గురవుతున్నాయన్న కేసులు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీంతో చోరీలకు పాల్పడుతున్న హోంగార్డు చిక్కాడు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పూర్తిస్థాయిలో విచారించగా తాను చేసిన దొంగతనాల చిట్టా విప్పాడు. దీంతో అతని వద్ద నుంచి 30 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ. 15 లక్షల వరకు ఉంటుందని డిసిపి చెప్పారు. కేసును ఛేదించిన డిఐ వెంకటేశ్వరరెడ్డి బృందానికి రివార్డు ఇవ్వాల్సిందిగా కమిషనర్‌కు సిఫార్సు చేస్తామని డిసిపి తెలిపారు. సమావేశంలో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్, డిఐ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

English summary
A homeguard was among three people arrested by the police here for allegedly stealing bikes, from whom 30 stolen two wheelers were seized, it was officially announced on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X