మోగిన సైరన్.. ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ పై సీపీ సీవీ ఆనంద్ చెప్పిందిదే
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఈరోజు హైదరాబాద్ లో నాలుగు ప్రదేశాలలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో పౌర మాక్ డ్రిల్ నిర్వహించారు. రెండు నిమిషాలు సైరన్ తో ఈ డ్రిల్ ప్రారంభమైంది. ఈ డ్రిల్ కు ప్రజల నుంచి విశేష ప్రతిస్పందన లభించింది. అత్యవసర పరిస్థితుల్లో పౌరులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులు ప్రదర్శనల ద్వారా వివరించారు.
హైదరాబాద్ లో నాలుగు చోట్ల ఆపరేషన్ అభ్యాస్
సికింద్రాబాద్, కంచన్ బాగ్, గోల్కొండ, మౌలాలీ లో ప్రధానంగా జరిగిన ఈ మాక్ డ్రిల్ లో పోలీస్, భద్రతా దళాలు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు కమాండ్ కంట్రోల్ నుంచి ఈ విన్యాసాన్ని పర్యవేక్షించారు. సంఘ వ్యతిరేక శక్తులు కాల్పులు జరుపుతూ భవనాల్లోకి చొరబడే దృశ్యాలు, మొదలైన వాటిని ఈ డ్రిల్ లో నమూనాగా ప్రదర్శించి చూపారు.

హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఏమన్నారంటే
డిఆర్డివో సమీపంలో 24 అంతస్థుల భవనంలో భవనం నుంచి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఏ విధంగా రక్షించాలనే ప్రదర్శనను కూడా చూపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కేంద్ర ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్లో మొత్తం నాలుగు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించామని, నాలుగు గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలర్ట్ ఇచ్చామన్నారు.
మిస్సైల్ ఎటాక్ జరిగినట్టు అలెర్ట్ ... చర్యలు మాక్ డ్రిల్
రెండు నిమిషాల పాటు పోలీస్, ఫైర్ వాహనాలు, ఇండస్ట్రియల్ సైరన్ లు మోగాయి అని తెలిపారు.నాలుగు ప్రాంతాల్లో మిస్సైల్ ఎటాక్ జరిగినట్టు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇక మిస్సైల్ ఎటాక్ జరిగిన ప్రాంతాలకు వెళ్లడంతో పాటు అక్కడ తక్షణం చేయవలసినటువంటి చర్యలు చేసి చూపించామని చెప్పారు.
ప్రజలను అప్రమత్తం చేసేందుకే మాక్ డ్రిల్
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ట్రాఫిక్ క్లియర్ చేయడం వంటి అనేక ఘట్టాలను నిజంగా జరిగితే ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చేసి చూపించామని పేర్కొన్నారు. ఈ మాక్ డ్రిల్ లో భాగంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు క్రౌడ్ కంట్రోల్ చేశారని, ఈ మాక్ డ్రిల్ లోని అంశాలు ప్రజల్లో అప్రమత్తత పెంచడానికే అని పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు . మాక్ డ్రిల్ లోని లోపాలను సమీక్షించుకుని మరింత అప్రమత్తంగా వ్యవహరించేలా చూస్తామన్నారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications