డ్రగ్ కేసులో మలుపు: ఇద్దరు సినీ స్టార్స్ అరెస్టుకు రంగం, ఆధారాలు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులకు ఉచ్చు బిగుస్తున్నదని తెలుస్తోంది. 12 మంది సినీ ప్రముఖులను సిట్ విచారించింది. అందులో ఇద్దరిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది.

మార్చి మార్చి: తెలియకుండానే కీలక సమాచారం ఇచ్చిన ముమైత్ ఖాన్

ఆ ఇద్దరు సినీ ప్రముఖులను అరెస్టు చేసేందుకు ఆధారాలు!

ఆ ఇద్దరు సినీ ప్రముఖులను అరెస్టు చేసేందుకు ఆధారాలు!

తాము విచారించిన 12 మందిలో ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం. వీరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం(ఎన్డీపీఎస్) ప్రకారం వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

Kajal Aggarwal, Raashi Khanna And Lavanya Tripathi Names In Drugs Scandal
మలుపులు తిరిగిన కేసు

మలుపులు తిరిగిన కేసు

కెల్విన్‌ పట్టుబడిన అనంతరం కేసు పలు మలుపులు తిరిగింది. విద్యార్థుల నుంచి సినీ స్టార్ల వరకు అతను డ్రగ్స్ సరఫరా చేశాడని తేలింది. సినీ ప్రముఖులతో పాటు మొత్తం 27 మందిని సిట్ విచారించింది.

విచారణ వీడియోల అధ్యయనం

విచారణ వీడియోల అధ్యయనం

కెల్విన్‌ ద్వారా వీరు డ్రగ్స్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించడంతో దానిపై లోతుగా విచారణ కొనసాగించారు. విచారణ ప్రక్రియ మొత్తం వీడియోలో చిత్రీకరించారు. సరఫరా, వాడకంలో వీరి పాత్ర ఏమిటన్నది తెలుసుకునేందుకు ప్రయత్నించారు. విచారణ సందర్భంగా చిత్రీకరించిన వీడియోలను ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు.

53 మంది పేర్లు చెప్పిన సినీ ప్రముఖుడు

53 మంది పేర్లు చెప్పిన సినీ ప్రముఖుడు

దాదాపు 60 గంటల వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. విచారణకు హాజరైన సినీ ప్రముఖులు చాలామంది తమ గురించే కాకుండా తమకు తెలిసిన ఇతర విషయాల గురించి వివరించారు. విచారణకు హాజరైన వారిలో ఓ సినీ ప్రముఖుడు ఏకంగా 53 మంది పేర్లు చెప్పాడని తెలుస్తోంది.

పలువురు నటుల పేర్లు.. ఒకటి రెండు పేర్లు అందరూ చెప్పారు

పలువురు నటుల పేర్లు.. ఒకటి రెండు పేర్లు అందరూ చెప్పారు

ఇందులో భాగంగా పలువురు నటుల పేర్ల ప్రస్తావ కూడా వచ్చిందని తెలుస్తోంది. వీరందరూ వేర్వేరుగా పేర్లు చెప్పిన్పటికీ ఒకటి రెండు పేర్లు మాత్రం అందరి జాబితాలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వారిపై ఇప్పుడు సిట్‌ అధికారులు ఉచ్చు బిగించబోతున్నారు.

ఆ ఇద్దరిపై కఠిన వైఖరే

ఆ ఇద్దరిపై కఠిన వైఖరే

డ్రగ్స్ వాడినా నేరమే. వాడినట్లు నిరూపణ అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇద్దరు సినీ ప్రముఖులపై తీవ్రమైన అభియోగాలు ఉన్నట్లు సిట్ గుర్తించిందని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారని సమాచారం.

కోర్టు ద్వారా వారి శాంపిల్స్ సేకరణ

కోర్టు ద్వారా వారి శాంపిల్స్ సేకరణ

విచారణకు హాజరైనవారిలో కొందరి నుంచి గోళ్ళు, వెంట్రుకలు, రక్తం నమూనాలు సేకరించారు. డ్రగ్స్ వాడుతున్నారా? లేదా? అన్నది నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కొందరు నమూనాలు ఇస్తామన్నా అధికారులు తీసుకోలేదు. నవదీప్ సహా ఒకరిద్దరు శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. అలాంటి వారి శాంపిల్స్ కోర్టు ద్వారా సేకరించాలని చూస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that SIT (Special Investigation Team) may arrest two tollywood personalities in hyderabad drug racket case.
Please Wait while comments are loading...