హైదరాబాద్ టెక్కీలకు శుభవార్త: జూన్ 2నాటికి ఈ రూట్లోనూ మెట్రో

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు ప్రజలకు ఊరట కలిగించే మెట్రో రైలు మరో మైలు రాయిని దాటింది. అతి క్లిష్టమైందే కాకుండా ఇంజనీరింగ్ నైపుణ్యానికి సవాల్‌గా మారిన సమస్యను అధిగమించింది.

కారిడార్ 3లో ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు, కారిడార్‌ 1లో అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. వచ్చే జూన్ 2వ తేదీ నాటికి అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు, అదే విధంగా ఎల్బీనగర్ వరకు అందుబాటులో వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్ల ప్రయాణం ఇక్కట్లు తీరుతాయి.

లక్డీ కా పూల్‌లో పూర్తయింది

లక్డీ కా పూల్‌లో పూర్తయింది

అత్యంత రద్దీగా ఉండే లక్డీ కా పూల్‌లోని వంతెనపై నిర్మిస్తున్న మెట్రో కారిడార్ వద్ద అతి క్లిష్టమైన ఆర్వోబి పనులను పూర్తి చేశారు. 45 టన్నుల బరువు గల 13 ప్రీకాస్టు సెగ్మెంట్లతో హ్యాంగింగ్ బ్రిడ్జి తరహాలో దాన్ని నిర్మించి, హైటెన్షన్ సప్లయ్ స్టీల్ వైర్లను ఏర్పాటు చేశారు

  Hyderabad Metro Rail : Youth Escaped From Charges, Know How ? | Oneindia Telugu
  ఈ విధంగా చేశారు

  ఈ విధంగా చేశారు

  ఉప్పల్ ప్రీ కాస్టింగ్ యార్డులో తయారు చేసిన సెగ్మెంట్ల తరలింపు వల్ల సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రాత్రి పూట జాగ్రత్తగా భారీ క్రేన్లు, వాహనాలతో తరలించారు. అత్యధునాతనమైన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చేపట్టిన ఆర్వోబి పనులు పూర్తయినట్లు మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.

  లక్డీ కా పూల్‌లో ఇలా చేశారు..

  లక్డీ కా పూల్‌లో ఇలా చేశారు..

  లక్డీ కా పూల్ నిరంకారి భవన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద మెట్రో రైలు నిర్మాణానికి ఫౌండేషన్ వేసేందుకు స్థలం లేదు. మరో వైపు ట్రాఫిక్ కొనసాగుతోంది. అయినప్పటికీ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేశారు. ట్రాఫిక్ తగ్గుముఖం పట్టిన తర్వాత రాత్రి పూట పనులు సాగిస్తూ వచ్చారు.

  వ్యూహాత్మకంగా చేపట్టాం..

  వ్యూహాత్మకంగా చేపట్టాం..


  లక్డీ కా పూల్ వద్ద వ్యూహాత్మకంగా ఆర్వోబి పనులు చేపట్టినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. 391 అడుగుల పొడువు ఉన్న బ్రిడ్జి పనులు చిక్కులు లేకుండా జరిగేందుకు వీలుగా రైల్వే శాఖ వారానికి ఓసారి మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేసి సహకరించిందని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  An important and key in Hyderabad mero rail project ROB works at Lakdi ka pool was completed withing the stipuated time.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి