పార్టీ మార్పుపై తేల్చేసిన సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డిపై ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్టు వచ్చిన వార్తలను నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖండించారు.నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అబద్దాల పుట్ట అని నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

కంచర్ల ఎఫెక్ట్: గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తి, కారణమదేనా?

శుక్రవారంనాడు గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్గొండలో విలేకరులతో మాట్లాడారు.తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తానని చెప్పారు.

Congress MP Has Resigned కేసీఆర్ ప్రీ పోల్ వ్యూహం: టీఆర్ఎస్ నుంచి తిరిగి పోటీ! | Oneindia Telugu
Iam in TRS, says Nalgonda MP Sukhender Reddy

కేసీఆర్ నాయకత్వంలో జిల్లాకు మెడికల్ కాలేజీని సాధించుకున్నామని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కాగా... ఎమ్మెల్యే కోమటిరెడ్డికి 2014లో వచ్చిన మొత్తం వచ్చిన ఓట్లే 60వేలన్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో ఎలా గెలుస్తాడో చెప్పాలని సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు.. అలాగే తిట్లు, దూషణల ద్వారా లీడర్స్ కాలేరన్న విషయాన్ని కోమటిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nalgonda Mp Gutta Sukhender Reddy said that he won't join in congress. he spoke to media on Friday at Nalgonda.
Please Wait while comments are loading...