80సీట్లకు తక్కువ వస్తే కేసీఆర్ వేసే శిక్షకు నేను సిద్ధం: రేవంత్ రెడ్డి సవాల్!!

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో దూకుడుని చూపిస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కెసిఆర్ కు సవాల్ విసురుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో దుమారంగా మారాయి.

ఇక తాజాగా నిజామాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ రెడ్డి కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో మాట్లాడుతూ ఎంపీగా కవితను ఓడించారని కెసిఆర్ నిజామాబాద్ పై పగ పట్టారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి గెలిచిన ఎంపీ అడ్రస్ లేకుండా పోయాడని అరవింద్ ను టార్గెట్ చేశారు.

If congress get less than 80 seats, I am ready for KCRs punishment: Revanth Reddy challenge!!

వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని సీఎం కేసీఆర్ చెప్పి పదేళ్లు గడిచిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినా ఇప్పటివరకు ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే కెసిఆర్ బక్కపలుచని వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నాడని, వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకునేటప్పుడు, కేసీఆర్, కేటీఆర్ లు పోటీ పడతారని విమర్శించారు.

ప్రజలకు సేవ చేయాలంటే మాత్రం కెసిఆర్ బక్కపలుచని వ్యక్తి అవుతాడు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. పదవి పోతుందన్న భయంతో కెసిఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు.

ఇక ఇదే సమయంలో గుర్తుపెట్టుకో బిడ్డ... కాంగ్రెస్ కు 80 సీట్ల కంటే ఎక్కువే రాబోతున్నాయి. డిసెంబర్ 3వ తేదీన లెక్కపెట్టుకో అంటూ కేసీఆర్ వేసే శిక్షకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి 80 సీట్ల కంటే తగ్గితే కేసీఆర్ వేసే శిక్షకు తాను సిద్ధం అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+