ఐఎండీ వార్నింగ్: తెలంగాణా చలితో గజగజ.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్!

తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన చలి వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా తగ్గిపోయాయి. ఇక రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ప్రభావం చూపిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోవు రెండు రోజుల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

చలి తీవ్రతరం... జాగ్రత్త
తీవ్ర తరం అవుతున్న చలి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవచ్చని, హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో చలి ప్రభావం బాగా ఎక్కువగా ఉంది.

IMD warning Telangana Cold intensity is gradually increasing Orange alert for these districts

హైదరాబాద్ లో బాగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఆదివారం ఉదయం శేరిలింగంపల్లి ప్రాంతంలో అత్యల్పంగా పది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇక ఈ రెండు రోజులు నగరంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల నుండి 11 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో దట్టమైన పొగ మంచు వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు.

పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
ఇక రాబోవు రెండు రోజులు పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు. ఈ జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు నుండి పది డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నవోదయ అవకాశముందని పేర్కొన్నారు.ముఖ్యంగా ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, మెదక్, నిర్మల్ భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.

పొగమంచుతో ప్రయాణాలు చెయ్యొద్దు
ఈ జిల్లాలలో చలి సాధారణం కంటే అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాత్రిపూట, తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, పిల్లలు వెచ్చని దుస్తులు ధరించాలని సూచించారు. ఇక నిన్న రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 7.4 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 8.6 డిగ్రీలుగా నమోదు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+