India Tv-Cnx Opinion Poll : తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీ-కాంగ్రెస్ కు నిరాశే ?

ఇవాళ వెలువడిన ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ లో తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే పరిస్దితి ఎలా ఉండబోతోందన్నది తేలిపోయింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నవేళ లోక్ సభ ఎన్నికల విషయంలో తెలంగాణ ఓటరు ఎలా స్పందిస్తున్నాడన్నది ఈ ఫలితాలు వెల్లడించాయి. గతంతో పోలిస్తే ఓ సీటు తగ్గినా అధికార బీఆర్ఎస్ మాత్రం మరోసారి తన పట్టు కొనసాగించబోతున్నట్లు ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది.

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం తెలంగాణలో ఈసారి బీఆర్‌ఎస్‌కు 40 శాతం ఓట్లు రావచ్చని, బీజేపీకి 28 శాతం ఓట్లు రావచ్చని తేలింది. అలాగే కాంగ్రెస్‌ 23 శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకోవచ్చని అంచనా వేసింది.రాష్ట్రంలో లోక్ సభ సీట్ల వారీగా చూస్తే బీఆర్ఎస్ 8 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే బీజేపీ 6 సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు దక్కించుకుంటాయని ఈ సర్వే తేల్చింది.

india tv-cnx opinion poll : kcrs brs continue to lead, bjp second, congress in third spot

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్ధానాలుండగా.. గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, ఎంఐఎం ఓ సీటు గెల్చుకున్నాయి. ఈసారి బీఆర్ఎస్ ఒక్క సీటు కోల్పోయి 8 సీట్లకు పరిమితం కానుందని తేలింది. అలాగే బీజేపీ రెండు సీట్లు పెంచుకుని 6 సీట్లకు చేరుకుంటుందని, కాంగ్రెస్ ఓ సీటు కోల్పోయి 2 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే చెబుతోంది. ఎంఐఎం మాత్రం ఎప్పటిలాగే హైదరాబాద్ ఎంపీ సీటును నిలబెట్టుకునే అవకాశం ఉంది.

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని తాజాగా వెలువడిన సర్వేలన్నీ తేల్చాయి. తాజా సర్వేలో అయితే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని కూడా తేలింది. కానీ ఇవాళ ఇండియా టీవీ సర్వేలో మాత్రం లోక్ సభ పోరులో బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగుతున్నట్లు తేలడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత బాగా పుంజుకుందని తేలినా, లోక్ సభ పోరులో మాత్రం ఓ సీటు కోల్పోతుందని చెప్పడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+