బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పదేపదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున బీఆర్ఎస్ మహిళ కార్పొరేటర్ పై విచక్షణ రహితంగా దాడి ఘటన చోటుచేసుకుంది.
వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు , ఆమె భర్త కారులో ప్రయాణం చేస్తున్న క్రమంలో, ఒక్కసారిగా మహిళలు కారును అడ్డుకొని దేదీప్య రావు పై దాడి చేశారు. విచక్షణారహితంగా మహిళలు ఆమెను కొట్టారు. దీంతో ఆమె స్వల్ప గాయాల పాలయ్యారు. కారులో ఉన్న దేదీప్య రావు భర్త ఎంత వారించినప్పటికీ ఆగకుండా మహిళలు దాడికి పాల్పడ్డారు.

అయితే జూబ్లీహిల్స్ లో చోటు చేసుకున్న ఫ్లెక్సీల వివాదమే దీనికి కారణమని, కాంగ్రెస్ నాయకుల అండతోనే బి ఆర్ ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై మహిళలు దాడి చేశారని ఆమె భర్త విజయ్ ముదిరాజ్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు పై మహిళలు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి. pic.twitter.com/uZwzHKxq6E
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2024
దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దేదీప్య రావు, ఆమె భర్త విజయ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక కార్పొరేటర్ పై దాడి చేసిన మహిళలు ఇదే సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పైన కూడా సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ అరాచకాలు కూడా పెట్రేగి పోయాయని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు.
వారు బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే బి ఆర్ ఎస్ కార్పొరేట్ దేదీప్య రావు, ఆమె భర్త విజయ్ ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పాలన దాడుల పాలన అంటూ బీఆర్ఎస్ నేతలు ఈ దాడిని ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications