షాకింగ్: పట్టపగలు.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా.. విద్యార్థిని నరికి చంపేశారు!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొంతమంది దుండగులు బస్సులో ప్రయాణిస్తోన్న ఓ విద్యార్థిని చొక్కా పట్టుకుని కిందికి లాగి, పట్టపగలే నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో నరికి చంపారు. సోమవారం కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుటే జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

మృతుడు మూసాపేటకు చెందిన ఎర్రగళ్ల సుధీర్(17)గా చెబుతున్నారు. ఇతడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు బస్సులో వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Intermediate student stabbed to death in full public view

నలుగురు దుండగులు సుధీర్‌ను బస్సులోంచి బలవంతంగా కిందికి లాగారు. బస్సు నుంచి దిగిన సుధీర్ వారినుంచి తప్పించుకుని రోడ్డుపై పరిగెత్తాడు. అయినా వారు వదలకుండా అతడ్ని వెంటాడి కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు.

ఈ ఘటనలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన సుధీర్ అక్కడికక్కడే ప్రాణం విడిచినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఆ నలుగురు దుండగుల్లో ఒకడిని స్థానికులు పట్టుకోగా మరో ముగ్గురు పరారయ్యారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడ్ని అదుపులోకి తీసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధీర్ స్నేహితులైన నవీన్, కృష్ణ, మహీ, తేజ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధీర్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An intermediate student was murdered on the busy road of Kukatpally to Ameerpet at the broad day light on Monday morning. According to sources, Sudheer Erragalla (17), was stabbed to death by four miscreants. The deceased was pursuing junior intermediate and was on his way to give his board examination. The four murders dragged him out bus and chased him and assassinated in the middle of the road, right in front of Kukatpally Traffic Police Station. He received serious stab injuries and died on the spot. The crowd on the road caught hold of one of the murders and handed him over to the police. The body was shifted to Gandhi hospital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి