ఓరుగల్లుకు మరో మణిహారం.. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం

ఓరుగల్లుకు మరో మణిహారం రాబోతోంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా వెల్లడించారు.

క్రికెట్ స్టేడియం నిర్మాణం ఇక్కడే

వరంగల్ లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి స్టేడియాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. నేషనల్ హైవే 163 కి సమీపంలో ఉన్న ధర్మసాగర్ మండలం ఉనికి చర్ల గ్రామం వద్ద కుడా కి సంబంధించిన స్థలం ఉండడంతో ఈ ప్రాంతంలో స్టేడియం నిర్మాణాన్ని చేపడితే అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

international cricket stadium in warangal mla kadiyam srihari said good news on the work progress

30 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం

మొత్తం 30 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో మినీ స్టేడియం లు, ప్రతి లోక్సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించింది . అలాగే కీలక ప్రాంతాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ స్టేడియం కోసం విజ్ఞప్తి

ఓరుగల్లులో క్రీడాస్ఫూర్తి ఉన్న యువత ఎంతోకాలంగా క్రికెట్ స్టేడియం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వారి కోరికను తీర్చడంతోపాటు ఇక్కడ యువతలోని క్రీడలు ప్రోత్సహించడం కోసం కూడా క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు క్రికెట్ స్టేడియం కావాలని స్పోర్ట్స్ స్కూల్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం రేవంత్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

త్వరలోనే అనుమతులు

ప్రస్తుతం స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వం వద్ద ఉంది. కుడా పరిధిలోని 30 ఎకరాల భూమి వివరాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ సెక్రటరీ జయశ్రీ రంజాన్ కు అందజేశారు. ప్రస్తుతం క్రీడల శాఖ వద్ద ఉన్న ఈ ఫైల్ పైన త్వరలోనే అనుమతులు రానున్నాయి.

ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు ఈ స్టేడియం వేదిక

అనుమతులు వచ్చిన తర్వాత స్టేడియం నిర్మాణానికి వేగంగా అడుగులు పడతాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ స్టేడియం నిర్మాణం జరగనున్న నేపథ్యంలో, అంతర్జాతీయంగా జరిగే మ్యాచ్ లకు కూడా భవిష్యత్తులో ఓరుగల్లు వేదిక అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+