హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీటెక్ విద్యార్ధిని దేవిని చంపేశారా.. : ఆ రోజు అసలేం జరిగింది..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో గత ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జరిగింది హత్యా..! నిజంగా రోడ్డు ప్రమాదంలోనే దేవి చనిపోయిందా..! అన్నది ఇప్పుడో మిస్గరీగా మారిపోయింది. ఘటన జరిగిన తీరుకు, పోలీసులు చెప్తున్న సమాధానాలకు కూడా ఎక్కడ పొంతన కుదరకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మెన్ చెప్తున్న వివరాల ప్రకారం..

తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఘటన జరిగిన స్థలానికి దగ్గరలో ఉన్న ఇంటికి వాచ్‌ మెన్ డ్యూటీకి వచ్చాడు. ఆ సమయంలో ఒక కారు అక్కడ పార్క్ చేసి ఉండడాన్ని గమనించాడు. తన యజమాని కారును కడుగుతున్నప్పుడు సుమారుగా 3.40గంటల సమయంలో అప్పటికే అక్కడ పార్క్ చేసి ఉన్న కారులో నుంచి యువతి గట్టిగా కేకలు వేయడం గమనించాడు. ఆ తర్వాత 3.50 గంటల ప్రాంతంలో ఆ కారులో ఉన్న దేవి అనే యువతి అందులో ఉన్న వ్యక్తుల నుంచి తప్పించుకునే క్రమంలో కారు వెనుక డోర్ నెట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నం చేసింది. ఆమె బయటకు వచ్చీ రాగానే.. ముగ్గురు యువకులు దేవిని బలవంతంగా లాక్కెళ్లి కారులో పడేశారు. ఆ తర్వాత 10 నిమిషాలకు అంటే సరిగ్గా 4 గంటల ప్రాంతంలో కారు అక్కడి నుంచి వెళ్లిపోయిన కారు.. 4.35-4.45 గంటల సమయంలో ప్రమాదానికి గురైనట్టుగా పాలు విక్రయించే వ్యక్తి వాచ్‌మెన్ తో చెప్పాడు.

ట్విస్ట్: బిటెక్ విద్యార్థిని మృతి, తాగి అతను కారు నడిపాడా? ట్విస్ట్: బిటెక్ విద్యార్థిని మృతి, తాగి అతను కారు నడిపాడా?

is devi was murdered.. what happened that day

కాగా.. జరిగిన ఘటనను రోడ్డు ప్రమాదంగానే భావించిన తల్లిదండ్రులు ఆమె అంత్యక్రియల పనుల్లో పడి ఇతర విషయాలపై అంతగా శ్రద్ద పెట్టలేదు. ఇదే క్రమంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించేందుకు దేవి కుటుంబీకులు వెళ్ళడంతో ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన వాచ్ మెన్ తాను చూసిందంతా చెప్పేయడంతో.. జరిగింది ప్రమాదం కాదని, హత్యేనని నిర్దారణకు వచ్చారు దేవి కుటుంబీకులు.

అనుమానానికి తావిస్తున్న అంశాలు :

ఒకవేళ కారు నిజంగానే ప్రమాదానికి గురైతే.. అంత వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీ కొట్టినప్పుడు చెట్టు కూడా విరిగిపోవడమో.. ఒకవైపుకు వంగిపోవడమో జరగాలి. కానీ కారు ఢీ కొట్టిన చెట్టుకు కేవలం చెట్టు బెరడను మాత్రమే.. అది కూడా ఎవరో తొలిచిన రీతిలో కనిపిస్తోంది. మరింత అనుమానాన్ని కలిగిస్తున్న విషయమేంటంటే..! ప్రమాదం జరిగినప్పుడు కారు ప్రయాణిస్తున్న రోడ్డుకు కుడి వైపున చెట్టు ఉంది. ఈ చెట్టుకు కారు ఢీకొందని పోలీసులు చెప్తున్నారు.
చెట్టు కుడివైపున ఉంటే కారు మాత్రం ఎడమవైపు భాగం దెబ్బతిని ఉండడం ఆలోచించాల్సిన విషయం. ఇక దేవి ముందు సీట్లో కూర్చున్నదని పోలీసులు చెప్పగా.. ప్రమాదం జరిగిన దేవి చనిపోయినప్పుడు ఆమె కారు వెనుక సీట్లో కిందపడి ఉండటం గమనార్హం.

తేలాల్సిన అంశాలు..

పోలీసులు చెప్తున్న దాని ప్రకారం.. కారులో దేవితో పాటు స్నేహితుడు భరత్ ఒక్కడే ఉన్నాడు. కానీ ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ చెప్తున్న దాని ప్రకారం కారులో భరత్ తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. కారులో భరత్‌ తోపాటు ఉన్న ఆ ఇద్దరు యువకులు ఎవరు? వారు వీళ్లతో పాటే కారులో ఎందుకు వచ్చారు? దేవికి వాళ్లకు మధ్య గంటపాటు ఎందుకు ఘర్షణకు జరిగింది? కారులోనుంచి కాపాడండి అని బయటకు వచ్చిన దేవిని బలవంతంగా లోపలికి ఎందుకు ఈడ్చుకెళ్లారు? మద్యం మత్తులో ఉన్న భరత్‌తోపాటు మిగతా ఇద్దరు దేవిపై లైంగికదాడికి పాల్పడి ఉంటారా? అందుకే దేవి రక్షించండి అంటూ ఆర్తనాదాలు పెట్టిందా? అన్న అంశాలు కేసులో ఇప్పుడు కీలకంగా మారాయి.

మలుపు: బిటెక్ విద్యార్థిని దేవి కారు ప్రమాదంలో చనిపోలేదా? మలుపు: బిటెక్ విద్యార్థిని దేవి కారు ప్రమాదంలో చనిపోలేదా?

దేవి కుటుంబీకులు ఏమంటున్నారంటే..

వాచ్ మెన్ చెప్పిన విషయాలే వాస్తవాలని, దేవిని ఖచ్చితంగా హత్య చేసే ఉంటారన్నారు దేవి తండ్రి నిరంజన్ రెడ్డి. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ న్యాయం చేయాలని కోరారు. దేవిపై లైంగిక దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తంచేసిన తండ్రి నిరంజన్ రెడ్డి.. ఆ ముగ్గురు యువకులతో ఘర్షణే తన కూతురి చావుకు కారణమైందని చెప్పారు. ఇదిలా ఉంటే.. దేవిని అపోలో హాస్పిటల్‌ కు తీసుకెళ్లే సమయానికే భరత్ తల్లిదండ్రులు హాస్పిటల్‌ లో ఉండడం పట్ల కూడా అనుమానం వ్యక్తం చేశారు. భరత్ తన తల్లిదండ్రులను, పోలీసులను మేనేజ్ చేసి ఉంటాడని ఆరోపించిన నిరంజన్ రెడ్డి. దేవి చనిపోయిన సమయంలో తన ఒంటిపై ఉన్న గాయాలు, దుస్తులను చూసి గుండె పగిలిపోయిందని కంటతడి పెట్టుకున్నారు.

is devi was murdered.. what happened that day

ఘటన తర్వాత వాచ్ మెన్ రాముకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కూడా ఇది ముమ్మాటికీ హత్యే అన్నదానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులిస్తామని చెప్పడంతోపాటు, ఘటనకు సంబంధించిన విషయాలు బయటకు వెల్టడిస్తే చంపేస్తామని బెదిరించినట్టుగా వాచ్‌ మెన్ రాము ఆందోళన వ్యక్తం చేశాడు.

పోలీసుల వాదన..

దేవి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆమెపై లైంగికదాడి చేసి, హత్య చేసి ఉంటారని దేవి కుటుంబీకులు తమకు ఫిర్యాదు చేసినట్టుగా వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు చెప్పారు. దేవి మృతికి ముందు ఘర్షణ జరిగిందని ప్రత్యక్ష సాక్షి వాచ్‌ మెన్ రాము చెప్తున్న నేపథ్యంలో ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు డీసీపీ.

English summary
The btech student devis road accident was taking turns. according to the information of watch men ramu who is present at that moment in incident place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X