అల్లుఅర్జున్ అరెస్ట్ లో కుట్రకోణం ఉందా? తాజా సర్వేలో విస్తుపోయే వాస్తవాలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ అరెస్టు పైన ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం కరెక్టేనని చెబుతుంటే, మరికొందరు ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు చేశారని విమర్శలు చేస్తున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ లో కుట్ర .. షాకింగ్ సర్వే
అయితే అల్లు అర్జున్ అరెస్టు పైన ఓ జాతీయ వార్తా సంస్థ ఆసక్తికర సర్వే నిర్వహించింది. అల్లు అర్జున్ నిజంగానే తప్పు చేశాడా? లేకపోతే తెలంగాణ పోలీసులు కక్షపూరిత ధోరణితో ఆయనను అరెస్టు చేశారా? అనే కోణంలో ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ప్రశ్నం.ఏఐ తో కలిసి నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత సర్వే తో అసలు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో నిర్వహించిన సర్వే
అయితే ఈ సర్వేలో విస్తు పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఇక ఈ సర్వేలో వచ్చిన ప్రజల రెస్పాన్స్ పైన రిపోర్ట్ విడుదల చేసిన సంస్థ ఏమని తేల్చింది అంటే..ప్రశ్నం. ఏ ఐ తో కలిసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో నిర్వహించిన సర్వేలో అల్లు అర్జున్ అరెస్ట్ లో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందా అనే ప్రశ్నకు 2052 మంది వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
సర్వే ఫలితాలు ఇలా
ఇందులో 34శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు. అంటే మొత్తం 843మంది తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్లే అల్లు అర్జున్ అరెస్టు జరిగినట్లుగా చెప్పారు. ఇక కాదని 33%మంది సమాధానం ఇచ్చారు అంటే 841మంది అల్లు అర్జున్ అరెస్టులో ఎటువంటి కుట్రకోణం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 14శాతం మంది ఏమి చెప్పలేమని వెల్లడించగా, 19శాతం మంది అసలు సమాధానమే చెప్పేందుకు ఇష్టపడలేదు.
50.. 50 గా ప్రజల అభిప్రాయం
అయితే జాతీయ వార్తా సంస్థ వెల్లడించిన ఈ సర్వేలో అవును, కాదు అన్న సమాధానం 34, 33 శాతంగా ఉన్నందున ప్రజలలో అల్లు అర్జున్ అరెస్టు పైన దాదాపు సగం మంది తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా, సగం మంది తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నమ్ముతున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్టులో కుట్ర కోణం దాగి ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన ఈ సర్వే సంచలన నిజాలను వెల్లడించింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications