మహిళా దినోత్సవం సాక్షిగా విలువైన మాట చెప్పిన జూనియర్ ఎన్టీఆర్!
నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహిళా శక్తిని కొనియాడుతున్నారు. మహిళల పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే నిజంగానే సమాజంలో మహిళల మీద ఇంత ఆదరణ ఉందా అంటే, సమాజంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు లేదు అన్న భావనని కలిగిస్తున్నాయి.
మహిళల పట్ల నిజమైన గౌరవం ఇదే
నేటికీ పనిచేసే చోట మహిళలపై కొనసాగుతున్న వివక్ష, మహిళలు, బాలికల పైన నేటికీ కొనసాగుతున్న అత్యాచారాలు, కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న లింగ వివక్ష వెరసి మహిళలు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అటువంటి మహిళా లోకం పట్ల నిజమైన గౌరవాన్ని ప్రదర్శించడం లింగ బేధం లేకుండా పిల్లలను పెంచడమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహిళల పట్ల ఎన్టీఆర్ గౌరవం
మన సమాజంలో చాలాకాలంగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ధోరణి మారాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అయితే మహిళల పట్ల నిజమైన గౌరవం మాటల్లో కాదు చేతల్లో చూపించాలని భావించే వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నటుడు అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నైతిక విలువలు ఉన్న వ్యక్తిగా సమాజంలో మహిళల పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తారు.
ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలి
తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన చాలా విలువైన ప్రకటన చేశారు. బెంగళూరులో జరిగిన ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే చెప్పడం తనకు నచ్చదని ఆయన పేర్కొన్నారు. ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించే విధంగా తన ఇద్దరు కుమారులను పెంచుతానని జూనియర్ ఎన్టీఆర్ మహిళా దినోత్సవం సాక్షిగా వెల్లడించారు.
విలువైన మాట చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
తన ఇద్దరు కుమారులను మహిళల పట్ల గౌరవభావంతో పెరిగేలా తాను బాధ్యతలు తీసుకుంటానని స్పష్టం చేశారు. తనకు ప్రతీసారి మహిళలను ఏ విధంగా గౌరవించాలి అనేది గుర్తు చేయడం ఇష్టం లేదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. సమాజంలో అటువంటి మార్పు రావాల్సిన అవసరాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. మహిళా దినోత్సవం రోజున చాలా విలువైన మాట జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు విన్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications