కోమటోళ్లు: మరో వివాదాస్పద వ్యాఖ్య చేసిన కంచ ఐలయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పేరుతో పుస్తకం రాసి వివాదాస్పదుడైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నల్ల కోమట్లు ద్రావిడులే.. తెల్ల కోమట్లు ఆర్యులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాక్ నుంచి వచ్చిన ఆర్యులు ప్రాచీనమైనన హరప్పా, మొహంజోదారో సంస్కృతిని నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఆర్యవైశ్య సత్రాలు బ్లాక్‌మనీ కేంద్రాలని కంచ ఐలయ్య మరో వివాదానికి తెరలేపారు. దేశ సంపదలో 46 శాతం ఆర్యవైశ్యుల చేతిలో ఉందని అంటూ దేశంలో పాన్ బ్రోకర్ బిజినెస్ ఎవరు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Kancha Iliah makes another controversial comment
Kancha Ilaiah vs Arya Vysya community దానికి సిద్దమా?, పేరు మారుస్తా..ఐలయ్య సవాల్!| Oneindia Telugu

వారి పరిశ్రమల్లో, వ్యాపారాల్లో ఐదు శాతం ఉద్యోగాలను ఇతరులకు ఇస్తే సామాజిక సర్వర్లు వైశ్యులుగా మారుస్తానని కంచ ఐలయ్య చెప్పారు. తన డిమాండ్లకు ఆర్యవైశ్యులు అంగీకరిస్తే సుందర్య విజ్ఞాన కేంద్రం దగ్గర పుస్తకాలు తగలబెడతానని కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు.

ఆర్యవైశ్యసత్రాల్లో గోత్రాన్ని, కులాన్ని చూసి అనుమతిస్తారని ఆయన తెలిపారు. బీజేపీకి ఆర్యవైశ్యులు ఇస్తున్న విరాళంలో ఐదు శాతం రైతులకిస్తే ఆత్మహత్యలే ఉండవని కంచ ఐలయ్య చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Samajika Smugglerlu Komatollu book writer professor Kancha Ilaiah made another controversial comment on Vaishyas.
Please Wait while comments are loading...