మహిళలతో దాండియా ఆడిన రోబో.. పండుగల్లోనూ రోబోల జోరు!

కాలం మారిపోయింది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ పుణ్యమాని పండుగలు , వేడుకలు కూడా రోబోలతో జెట్ స్పీడ్ లో జరిగిపోతున్నాయి. ఒక పక్క ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ క్షణాల్లో మనకు కావాల్సిన పనులు చేస్తుంటే మరోపక్క హ్యూమనాయిడ్ రోబోలు మానవ అవసరాన్ని తగ్గించే పనిలో ఉన్నాయి. తాజాగా అటువంటి సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

కరీంనగర్ జిల్లా నగునూరులోని దుర్గాభవానీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన దాండియా కార్యక్రమంలో ఒక హ్యూమనాయిడ్ రోబో సందడి చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించి భక్తులతో కలిసి దాండియా కర్రలు పట్టుకుని నృత్యం చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. రోబోను చూసి భక్తులు ఆశ్చర్యంతో చూస్తూ ఫొటోలు తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Karimnagar robot dandiya Robot Dances Dandiya with Devotees in Karimnagar Temple - Human-Robot Coexistence

ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు సర్వ సాధారణంగా మారుతున్నాయి. గుజరాత్‌లో గర్బా వేడుకల్లో, ఉజ్జయిని మహాకాల్ ఊరేగింపులో కూడా హ్యూమనాయిడ్ రోబోలు పాల్గొని మంత్రాలు చదవడం, నృత్యం చేయడం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి. కేరళ ఆలయాల్లో జంతు సంరక్షణ కోసం రోబో ఏనుగులు కూడా ఉపయోగిస్తున్నారు. పండుగలు, భక్తి కార్యక్రమాల్లో రోబోలు సాంస్కృతిక అనుభవాన్ని కొత్త పుంతలు తోక్కిస్తున్నాయి.

రోబోల వినియోగం కేవలం వినోదానికే పరిమితం కాదు. ఆసుపత్రుల్లో రోగులకు మార్గనిర్దేశం చేయడం, వృద్ధుల సంరక్షణ, విద్యాలయాల్లో సహాయక ఉపాధ్యాయులుగా పని చేయడం, పరిశ్రమల్లో ప్రమాదకర పనులు చేయడం వంటి రంగాల్లో వీటి పాత్ర పెరుగుతోంది. భవిష్యత్తులో మనుషులు, రోబోలు కలిసి పని చేసే సహజీవనం సాధారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు.

పండుగ వేళ డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ షాక్.. ఆ సెలవులు లేనట్టే!
పండుగ వేళ డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ షాక్.. ఆ సెలవులు లేనట్టే!

రోబోలు మనుషుల స్థానాన్ని ఆక్రమించకుండా, వారి సామర్థ్యాలను పెంచే సహాయకులుగా ఉండాలనేది లక్ష్యం, అయితే రోబోలు మనుషుల అవసరాన్ని, వారి ఉనికిని ప్రశ్నార్ధకం చేసే స్థాయికి వెళ్ళేలా పరిస్థితి కనిపిస్తుంది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఏది ఏమైనా సాంప్రదాయం, సాంకేతికత కలిసినప్పుడు కొత్త అనుభవాలు పుడతాయి. కరీంనగర్‌లో రోబో దాండియా అలాంటి చిన్న ఉదాహరణే. ముందుకు ఇలాంటి సహజీవనం మరింత సహజంగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+