Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పీకల లోతు కష్టాలలో మునిగిపోయారు. బెయిల్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కావాలని కోర్టులో వాదోపవాదాలు జరగగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసి మే రెండవ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది.

అప్పటివరకు కవితకు నిరీక్షణ తప్పదు
ఇక తాజాగా ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై గత మూడు రోజులుగా వాదనలు జరుగుతుండగా ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో మే 6 తేదీన తీర్పు వెల్లడించనుంది. దీంతో మళ్లీ కవితకు అప్పటివరకు నిరీక్షించవలసిన పరిస్థితి వచ్చింది. అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అన్న ఉత్కంఠ ఈ నేపథ్యంలో నెలకొంది.

Kavitha has to wait for bail Judgment reserved in ED case too

కవిత చెప్తున్న వాటిలో వాస్తవం లేదు
కవిత బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగగా ఈడీ తన వాదనలను వినిపించింది . సెక్షన్ 19 కింద కవితను చట్టబద్ధంగా అరెస్టు చేశామని, అక్రమంగా అరెస్ట్ చేశామని వారు చెబుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని ఈడీ పేర్కొంది. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తమ వాదనను వినిపించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని వెల్లడించింది.

ఈ కేసులో కీలకం కవితనే
దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని పేర్కొన్న ఈడి 581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని, ఐదు నుంచి 12 శాతానికి కమిషన్ పెంచారని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని, కవిత ఈ కేసులో కీలక భూమిక పోషించారని తెలిపారు.

ఫోన్లలో డేటా ఎందుకు డిలీట్ చేశారు
ఈ కేసుకు సంబంధించి నిందితుల నుండి అనేక సాక్ష్యాలు దొరికాయి అని, కవిత ఈడీ అధికారులకు ఇచ్చిన తొమ్మిది ఫోన్లలోనూ డేటా డిలీట్ చేశారని, ఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కవిత ఫోన్ లను పని మనుషులకు ఇచ్చారని, వారిని విచారణ జరిపితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, పనిమనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారంటూ ప్రశ్నించారు.తీర్పు రిజర్వ్ .. మే 6 వరకు టెన్షన్ సాక్షాలను ధ్వంసం చేయడమే కాకుండా సాక్షులను కవిత బెదిరించారని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వద్దని ఈడి కోర్టులో బలంగా వాదించింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసి మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+