కేసీఆర్ సీఎం అర్హత కోల్పోయారు.!కేంద్రంతో కలిసి దొంగ డ్రాలమాలు చేస్తున్నారన్న పొన్నాల.!
హైదరాబాద్ : ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్ వరకు కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేసింది. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య బషీర్ బాగ్ లోని వ్యవసాయ కమిషనరేట్ ముందు నిర్వహించిన నిరసన కారక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రధాన ఎజెండా అని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన పోరాటం చేయడం రెండో ప్రధాన అంశంగా వివరంచారు పొన్నాల లక్ష్మయ్య.

రైతులపట్ల అసలైన ద్రోహి కేసీఆరే.. దొంగదీక్షలు చేస్తున్నారన్న పొన్నాల
అంతే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావు ఏ మొఖం పెట్టుకొని గవర్నర్ ను సంప్రదించారని పొన్నాల లక్ష్మయ్య నిలదీసారు. తాము ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలను గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్తుంటే అడ్డుకున్న అధికార పార్టీ వైశాచిక ఆనందంపొందిందని గుర్తుచేసారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఎందుకు వెళ్ళలేదని చంద్రశేఖర్ రావును పొన్నాల సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇందిరా పార్క్ వేదిక అయినప్పుడు దక్షిణాది సదస్సు రైతు సమస్యల వేదికగా ఎందుకు ఉపయోగించుకోలేదని సూటిగా ప్రశ్నించారు. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఈ సమావేశంలో 26 అంశాలు ఉన్నాయని, 26 అంశాలు ఉన్నప్పుడు ఈ
కొత్త అంశాన్ని చేర్చి చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా అని పొన్నాల నిలదీసారు.

దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ధర్నా చేసి ఉంటే బాగుండేది.. కేసీఆర్ అంతా డ్రామాలన్న కాంగ్రెస్
చంద్రశేఖర్ రావు కు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ధర్నా చేసి ఉంటే రైతులు గౌరవించే వాళ్లు కదా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని, రాష్ట్ర బిజెపి నాయకులు అడగడం ఏంటని, కేంద్రంలో ఉన్నది బిజెపి ప్రభుత్వం కాదా అని బీజేపి నేతలను పొన్నాల సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వద్దకు పిలిపించి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపి నేతలకు లేదా అని నిలదీసారు. బీజెపి, టిఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి రైతుల పక్షాన ఉందని, 15 లక్షల కౌలు రైతులకు చంద్రశేఖర్ రావు ఎటువంటి సహాయం లేదని, కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన కూడా పోరాటం చేసిందని గుర్తు చేసారు.

సీఎం గా కేసీఆర్ అర్హత కోల్పోయారు.. మండిపడ్డ పొన్నాల
రైతాంగం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ నివేదిక కూడా పారదర్శకంగా లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోందని, రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు అర్హుడు కాడని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రైతులు పండించిన పంటను రాష్ట్ర, కేంద్ర సర్కార్ లు కొనకుండా ఒకరి మీద ఒకరు నెపం మోపుకుంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ధాన్యాన్ని కొన్నా కొనకపోయినా, తాను కొంటానని గతంలొ చంద్రశేఖర్ రావు స్పష్టం చేసారని, ఇప్పుడు ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తే రైతులు మర్చిపోతారని చంద్రవేఖర్ రావు ఎలా అనుకుంటున్నారని మండి పడ్డారు.
Recommended Video

ఇక విడిచిపెట్టం.. గ్రామగ్రామంలో ఉద్యమం చేపడతామన్న మాజీ పిసీసీ పొన్నాల
అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం అంటే చంద్రశేఖర్ రావు సుముఖత చూపలేదని, ఇప్పుడేమో ఇందిరా పార్క్ వద్ద చంద్రశేఖర్ రావు ధర్నా లో కూర్చున్నారని, దీంతో బిజేపి, గులాబీ పార్టీలు రెండు ఒక్కటేనన్న అంశం ప్రజలకు అర్థం అయ్యిందని వివరించారు. రైతుల భూములను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఘాటు వ్యాఖలు చేసారు పొన్నాల. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరగనున్నాయని, చంద్రశేఖర్ రావుకు పాలన చేత కాకుంటే వదిలేయ్యాలని హితవు పలికారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications